వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీఊరిలో పూలకళ.. మహిళల్లో లక్ష్మీకళ; సద్దుల బతుకమ్మ నేడే.. గంగమ్మ ఒడికి బతుకమ్మ!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి ఊరిలోనూ పూల పండుగ సంబరాలు అంబరాన్ని తాకింది. రోడ్లన్నీ తంగేడు, గునుగు, కట్ల పూలతో నిండిపోయాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు నేడు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పువ్వులనే పూజించే పండుగ

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పువ్వులనే పూజించే పండుగ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డల అందరూ అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే దేవతగా కొలిచే అరుదైన ఈ పండుగలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా, అన్ని వయసుల వారు పాల్గొంటారు. తంగేడు, గునుగు, కట్ల, చేమంతి, బంతి, మల్లె, మొల్ల, మొగలి, సంపెంగ, కలువ, తామర వంటి పూలతో బంగారు బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్దంగా గౌరమ్మను పూజిస్తారు. రాగిపళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూల కట్టలు పేర్చి, మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ ఫుల్ గా బతుకమ్మను పేరుస్తారు.

 తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ తుది ఘట్టం

తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ తుది ఘట్టం

పువ్వులతో చక్కగా బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపై పసుపు తో గౌరమ్మను తయారుచేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. సాయంత్ర సమయంలో అందరూ తమ బతుకమ్మలను తీసుకుని, ఒక్క చోట చేరతారు. ఆడబిడ్డలు అందరూ అందంగా ముస్తాబై, పట్టు చీరలు ధరించి గౌరమ్మను తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పాటలతో పూజిస్తారు.

బంధువులు, బయటివారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఒక చోట చేరి పండుగ జరుపుకుంటారు. బతుకమ్మలను మధ్యలో పెట్టి చుట్టూ చేరి పాటలు పాడుతూ, తిరుగుతూ బతుకమ్మను ఆరాధిస్తారు. అందరూ ఒకచోట చేరి ఆడి పాడి బతుకమ్మను గంగమ్మ చెంతకు చేరుస్తారు. ఆపై గౌరమ్మకు తయారుచేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందరూ పంచుకుంటారు.

ఊరూ వాడలో పూల కళ... మహిళలలో లక్ష్మీ కళ

ఊరూ వాడలో పూల కళ... మహిళలలో లక్ష్మీ కళ

అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ గౌరమ్మను కోరుకుంటారు. ఇక ఈరోజు రోడ్లు, ఆలయాలు, చెరువులు అన్ని పూలతో కళకళలాడతాయి. ఈ ప్రకృతి సంబరాన్ని చూడడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహపడతారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా సంబరంగా జరుపుకో లేకపోయిన బతుకమ్మ పండుగను ఈసారి కరోనా మహమ్మారి కాస్త శాంతించడంతో ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్రమంతా రెడీ అయింది. ముఖ్యంగా మహిళలు ఈ రోజు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అత్యంత ఘనంగా, అట్టహాసంగా తెలంగాణ పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించి గౌరమ్మను గంగమ్మ చెంతకు చేర్చే వేడుక నేటితో ముగియనుంది.

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా సీఎం కేసీఆర్

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా సీఎం కేసీఆర్

ఇక మరోవైపు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో సాగిన బతుకమ్మ పండుగలో, గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క చోట సాంస్కృతిక వాతావరణం కనిపించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.

English summary
Saddula Bathukamma will be celebrated today in Telangana state where flowers celebration is seen in every village. Today women will celebrate by adding Bathukamma to Gangamma's lap..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X