తేజుకు సర్జరీ సక్సెస్- 24 గంటల అబ్జర్వేషన్ : కండీషన్ స్టేబుల్ -వెంటిలేటర్‌పైనే చికిత్స..!!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేసారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జి ప‌రిస‌రాల‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ను తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసిన తరువాత అపోలోకు తరలించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. యాక్సిడెంట్ సమయంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్రాక్చర్‌, కన్ను, ఛాతి భాగంలో గాయాలు కాగా, శరీరం లోపల మాత్రం ఎలాంటి రక్తస్రావం లేదని అపోలో వైద్యులు తెలిపారు.

దీంతో..ఎమ్మారైతో పాటుగానే అనేక పరీక్షలు చేయగా ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చారు. చికిత్సలో భాగంగా.. సాయి ధరమ్‌ తేజ్‌కి కాలర్ బొన్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ సక్సెస్ అయింది. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి తేజ్‌కి ట్రీట్‌మెంట్ అందివనున్నారు. మ‌రి కొద్ది సేప‌ట్లో సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుద‌ల కానుంది. హీరో రామ్‌చరణ్‌, నిర్మాత అల్లు అరవింద్‌ అపోలో ఆస్పత్రికి చేరుకుని తేజ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి 8.05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు.

సాయితేజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ని స్వాధీనం చేసుకుని.. రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిర్లక్ష్యపు, ర్యాష్‌ డ్రైవింగ్ వ‌ల‌న సాయి తేజ్‌కి ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం పైన భిన్న రకాలుగా జరుగుతున్న ప్రచారం పైన కొందరు సినీ ప్రముఖులు సీరియస్ అయ్యారు.

Sai Dharam Tej Collor bone surgery successfully completed by Apollo hospital

అదే విధంగా నరేశ్ చేసిన వ్యాఖ్యల పైన బండ్ల గణేష్ నేరుగా.. శ్రీకాంత్ పరోక్షంగా స్పందించారు. ఆయన ఆ రకమైన వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. ఇక, దర్శకుడు హరీష్ శంకర్ కొందరు చేస్తున్న ప్రచారం పైన సెటైరికల్ గా ట్వీట్ చేసారు. అపోలో వైద్యులు తేజుకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టత ఇచ్చారు. మెగా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తేజు ఆరోగ్యానికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. అదే విధంగా తొలుత ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ సాయి ధరమ్ తేజ్ ను గుర్తించలేదు.

స్థానికంగా ఒక స్టోర్ లో పని చేసే వెహికల్ పార్కింగ్ చూసే వ్యక్తి 108కి కాల్ చేయటంతో వాళ్లు వచ్చి తేజును మాదాపూర్ లోని మెడికోవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రమాదానికి గురైంది సాయి ధరమ్ తేజ్ గా గుర్తించారు. వెంటనే ప్రాధమిక చికిత్స చేస్తూనే..మెగా కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అయితే, గోల్డెన్ అవర్ లో చేయాల్సిన చికిత్స చేయటంతో ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు. ఆ తరువాత అలోలోలో ప్రత్యేక వైద్యుల టీం ఎప్పటికప్పుడు తేజు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. అవరమైన చికిత్స అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+