ట్రాఫిక్ పోలీసులకు సలాం.!కరోనా క్లిష్ట సమయంలో వారి సేవలు శభాష్ అంటున్న షర్మిళ పార్టీ నేతలు.!
హైదరబాద్ : కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ముద్ర వేసుకున్న పోలీసులు కరోనా విజృంభిస్తున్న తరుణంలో అసలుసిసలైన బాద్యతలను నిర్వహిస్తున్నారని షర్మిళ పార్టీ వైయస్ఎస్సార్ టీమ్ అభిప్రాయపడింది. దేశంలో ఎవ్వరూ చేయని ధైర్య సాహసాలను ఒక్క పోలీసులు మాత్రమే చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం తమ ప్రాణలను పణంగా పెట్టి మరీ రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నారని వైయస్ఎస్సార్ టీమ్ స్పష్టం చేస్తోంది. కరోనా రెండో దశ పంజా విసురుతున్న తరుణంలో ఎంతో మంది బలైపోతున్నారని, కళ్ల ముందు ఎంతో మంది అభాగ్యులు అశువులు బాస్తున్నా చెక్కు చెదరని మనో స్థైర్యంతో ముందడుగు వేస్తున్న పోలీసుల సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని వైయస్ఎస్సార్ టీమ్ అభివర్ణిస్తోంది. సాధారణ పోలీసులే కాకుండా ట్రాఫిక్ ను నియంత్రించే పోలీసులు కూడా ధ్వని, వాయు కాలుష్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు.

అంతే కాకుండా ఎండనకా, వాననకా మూడు కాలాలు ప్రకృతిలో వస్తున్న మార్పులను రోడ్ల మీద మీద నిలబడి ట్రాపిక్ పోలీసులు ఎదుర్కొంటారని, ిది అసలైన విద్యుక్త దర్మమని వైయస్ఎస్సార్ టీమ్ అభినందిస్తోంది. అంతే కాకుండా కరోనా విపత్కర సమయంలో పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, రేయింబవళ్ళు రోడ్లపై నిలబడి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ ఎటువంటి అంతరాయం కలుగకుండా చూస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా అనునిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడుతున్న ట్రాఫిక్ పోలీసులకు సలాం అన్నారు వైయస్ఎస్సార్ టీమ్ సభ్యులు. ఇటువంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని వైఎస్. షర్మిళ ముఖ్య అనుచరులు పిట్ట రాంరెడ్డి మరియు వాడుక రాజ్ గోపాల్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ లకు ఆపదలో తోడుగా వైయస్ఎస్సార్ టీమ్ ఆధ్వర్యంలో షర్మిల పిలుపు మేరకు ట్రాఫిక్ ఎస్ఐ జి. వెంకన్నగారి సమక్షంలో వారికి మాస్కులు, శానిటైజర్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ అందించడం జరిగిందని వైయస్ఎస్సార్ టీమ్ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications