మా జీతాలు రూ.3 లక్షలకు పెంచండి:'టీ' ఎమ్మెల్యేలు
హైదరాబాద్: భారత్‌లో ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో స్ధానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుక్రవారం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు కూడా తమ జీతాలను పెంచాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్యేల జీతం నెలకు రూ 1.20 ఉండగా, వాటిని రూ. 3 లక్షలకు పెంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు శనివారం నాడు అసెంబ్లీ లాబీలో సంతకాల సేకరణ చేపట్టారు.
సంతకాల సేకరణ పత్రాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖరరావుకి అందజయనున్నారు.












Click it and Unblock the Notifications