సమంత కంట కన్నీరు : నేను నీ దాన్ని- నీవు నా వాడివి : ఈ రోజు వారిద్దరికీ ప్రత్యేకమే-వైరల్..!!

టాలీవుడ్ లవ్లీ అండ్ రొమాంటిక్ కపుల్ సమంత - నాగ చైతన్య వివాహ బంధం ముగిసినట్లుగా ప్రకటించినా..అభిమానులు మాత్రం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. చై-సామ్‌ విడాకుల గురించి అనేక రకాల చర్చలు..ప్రచారాలు సాగినా పూర్తిగా అది వారిద్దరి వ్యక్తిగత అంశం. కలిసి ఉండాలని కోరుకున్న వారు వారిద్దరూ విడిపోయారనే నిజం నమ్మలేకపోతున్నారు. పదేళ్ల పాటు ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా ఉంటూ.. ఏడేళ్ల పాటు ప్రేమించుకొని ..పెద్దల అంగీకారంతో గోవాలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

నేడే వారి వివాహ వార్షికోత్సవం

నేడే వారి వివాహ వార్షికోత్సవం

ఈ రోజుకు వారి వివాహం జరిగి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయింది. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. కానీ, తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు చెబుతున్నట్లుగా ఈ నెల 2వ తేదీన చై-సామ్‌లు ప్రకటించారు. ఇక, ఈ రోజున వారి వివాహ వార్షికోత్సవం కావటంతో గత ఏడాది సమంత పోస్టు చేసిన పోస్టింగ్ లు తిరిగి వైరల్ అవుతున్నాయి. గత ఏడాది సమంత..తన ఇన్‌స్టాగ్రామ్‌లోనాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేసి.. ''నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌'' అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్టింగ్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో గత పోస్టింగ్ లు వైరల్

సోషల్ మీడియాలో గత పోస్టింగ్ లు వైరల్

అభిమానులు తమ బాధతో కూడిన పోస్టింగ్ లు పెడుతూ వారిద్దరి విడిపోవటం పైన ఆవేదన వ్యకత్ం చేస్తున్నారు. కొందరైతే ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు తిరిగి మీరిద్దరూ కలిసిపోతారని నమ్ముతున్నాన ని పోస్టులు చేసారు. ఈ ఫొటోలు చూస్తుంటే చాలా బాధగా ఉంది.. మీ మధ్య హద్దులు లేని ప్రేమ...ఇప్పుడు అంతు లేని దూరంగా ఎలా మారిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో విడాకుల తరువాత సమంత తొలి సారి కెమేరా ముందుకు వచ్చారు. ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు.

సమంత కంట కన్నీరు

సమంత కంట కన్నీరు

హైదరాబాద్‌లోని ముకరంజా జానియర్‌ కాలేజీలో దీనికి సంబంధించి షూటింగ్‌ జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కావటం..ఆ తరువాత విడాకుల ప్రకటన రావటంతో అసలు సమంత ఈ షూటింగ్ కు వస్తారా లేదా అనే టెన్షన్ యాడ్ మేకర్స్ లో కనిపించింది. అయితే, సమంత ఒప్పుకున్న మేరకు షూటింగ్ కు వచ్చారు. అయితే షూట్‌ గ్యాప్‌లో సమంత తీవ్ర భావేద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు వారు చెబుతున్నారు.

మనసులో బాధ ఉన్నా..షూటింగ్ కు మాత్రం

మనసులో బాధ ఉన్నా..షూటింగ్ కు మాత్రం

అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాగానే డైరెక్టర్‌ చెప్పినట్లు యాక్టింగ్‌ చేసిందంటూ వారు చెప్పుకొచ్చారు. తాను ఎంత బాధలో ఉన్నా.. ఒక యాక్టర్ గా తాను ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం షూటింగ్ కు హాజరు కావటం సైతం వారిని ఆకట్టుకుంది. ముంబైకి చెందిన యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ విశేష్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు. తామిద్దరం భార్య-భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని విడాకుల ప్రకటన సమయంలోనే నాగ చైతన్య స్పష్టం చేసారు.

Recommended Video

    Samantha పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. హాట్ టాపిక్ గా Madhavi Latha కామెంట్స్ | Oneindia Telugu
    ఈ రోజు మరోసారి వారి బంధాన్ని గుర్తు చేసుకుంటూ

    ఈ రోజు మరోసారి వారి బంధాన్ని గుర్తు చేసుకుంటూ

    తమ అభిమానులు అర్దం చేసుకోవాలని కోరారు. ఇక, నాగార్జున సైతం ఇద్దరు దూరం కావటం బాధకరమే అన్నారు. సమంత తమ ఇంట్లో ఉన్న రోజులు తాము ఎప్పటికీ మర్చిపోలేని మెమోరీస్ గా పేర్కొన్నారు. వారిద్దరికీ దేవుడు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆకాంక్షించారు. ఇక, ఈ రోజున వారి వివాహ దినోత్సవం కావటంతో..ఇప్పుడు సోషల్ మీడియాలో గతంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు..పోస్టులు వైరల్ అవుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+