నిజమే! ‘సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: సినీ కథానాయిక సమంతను చేనేత రాయబారిగా నియమించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు చేనేత, జౌళి శాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

నటి సమంతపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్: ఎందుకంటే..(పిక్చర్స్)

కేటీఆర్ ప్రకటన

కేటీఆర్ ప్రకటన

సమంతను చేనేత రాయబారిగా ఎంపిక చేసినట్లు ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ఒక కార్యక్రమంలో ప్రకటించిన విషయం విదితమే. కాగా, చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన కార్యక్రమానికి మద్దతు పలకడంతో సమంతకు గతంలో మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, పోచంపల్లి చీర, శాలువాను ఆమెకు బహూకరించారు.

చేనేత కోసం ప్రచారం

చేనేత కోసం ప్రచారం

సమంత.. మార్చి 10న సిద్దిపేటలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు చేనేత సహకార సంఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు.

హ్యాండ్లూమ్ పార్క్ సందర్శన

హ్యాండ్లూమ్ పార్క్ సందర్శన

దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను సమంత పరిశీలించారు. మార్చి 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను కూడా ఆమె సందర్శించారు.

కార్మికులతో..

కార్మికులతో..

ఆ తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను సమంత పరిశీలించారు. మార్చి 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను కూడా ఆమె సందర్శించారు. కార్మికులతో ముచ్చటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Cine Actress samantha is not brand ambassador for telangana handlooms.
Please Wait while comments are loading...