సండ్ర బెయిల్ షరతుల సడలింపు: సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిల్స్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ తెలగాణ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతించింది.
దీంతో గురు, శుక్రవారాల్లో తిరుపతిలో జరుగనున్న సమావేశాలకు సండ్ర హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్రకు బెయిల్ మంజూరు సమయంలో నియోజక వర్గం విడిచి వెళ్లరాదంటూ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిళ్లను టీవీ చానళ్ల నుంచి సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు వారిద్దరి ఇంటర్వ్యూ టేపులు ఇవ్వాలని కోరుతూ సంబంధిత టీవీ చానళ్ల యాజమాన్యాలకు లేఖలు రాశారు.
ఆ సీడీలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించేందుకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ అధికారులు బుధవారం కోర్టుకు సమర్పించారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications