మళ్లీ మొదటికి: సంగీతను ఇంట్లోంచి గెంటేసి, తాళం వేసుకున్నారు
హైదరాబాద్: వివాహిత సంగీత వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తాళాలు పగులగొట్టి ఇటీవల ఇంట్లోకి వెళ్లిన ఆమెను అత్తింటివారు బయటకు ఈడ్చేసి లోపల తాళం వేసుకున్నారు.
Recommended Video

గతంలో భర్త వేధింపులతో పాటు అత్తింటివారు బయటకు గెంటేయడంతో హైదరాబాదులోని బోడుప్పల్‌లో రెండు నెలల పాటు పోరాటం చేశారు. చివరకు కోర్టు అనుమతితో ఆమె తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

మళ్లీ వివాదం మొదటికి...
తాజాగా తిరిగి వివాదం ప్రారంభమైంది. సంగీతను అత్తింటివారు ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టి గేటుకు తాళం వేసుకున్నారు. దీంతో మరోసారి సంగీత రోడ్డున పడింది. బంధువులు చూస్తుండగానే ఆమెను ఇంట్లోంచి గెంటేసి, తాళం వేసుకున్నారు.

అతను ఇలా చేశాడు...
మేడ్చేల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన శ్రీనివాస రెడ్డి మొదటి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు. చందానగర్‌కు చెందిన సంగీతతో శ్రీనివాస్ రెడ్డికి నాలగేళ్ల క్రితం పెళ్లయింది. వారికి రెండేళ్ల పాప కూడా ఉంది. భర్త రెండో పెళ్లి గురించి ప్రశ్నించడానికి ఇంటికి వెళ్తే ఆమెపై దాడి చేశాడు.

వారంతా చూస్తుండగానే...
బంధువులంతా చూస్తుండగానే సంగీతను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు. దన్ని అక్కడ ఉన్నవారు సెల్‌ఫోన్‌ో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చశారు. ఆడపిల్ల పుట్టినందుకే తనన ఇంటి నుంచి గెంటేసినట్లు సంగీత ఆరోపించారు.

దాంతో ఆమె నిరాహార దీక్ష
దాంతో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్‌లోని సరస్వతీనగర్ కాలనీలో సంగీత భర్త ఇంటి ముందు దీక్షకు చేపట్టింది. దాదాపు రెండు నెలల పాటు ఆమె దీక్ష చేసింది. ఆమెకు ప్రజా సంఘాల కార్యకర్తలు, రాజకీయ నేతలు మద్దతు ప్రకటంచారు.

దాంతో ఇలా జరిగింది...
ఆ క్రమంలోనే కోర్టు కేసు నడిచింది. సంగీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఆమె తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డికి, తదితరులకు బెయిల్ మంజూరైంది. అయితే, సంగీతను శుక్రవారంనాడు అత్తింటివారు మళ్లీ బయటకు గెంటేసి తాళం వేశారు. దాంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.












Click it and Unblock the Notifications