సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్‌కు మంటలు, ఆర్పేసిన సిబ్బంది
హైదరాబాద్: శనివారం నాడు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్ దగ్ధమైంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా కోసం నగరంలో కూడా సెట్టింగ్ వేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 25లోని ఓ బంగ్లాలో సెట్టింగ్ వేశారు.
శనివారం నాటు ఆ సెట్ కాలిపోయింది. జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సెట్ వేశారని చెప్పారు. దీని పక్కనే ఓ క్రికెట్ ప్రాక్టీస్ క్లబ్ ఉందని చెప్పారు. శనివారం నాడు క్లబ్ రినోవేషన్ కోసం వెల్డింగ్ పనులు చేశారన్నారు. ఈ సందర్భంగా మంటలు అంటుకున్నాయని చెప్పారు. ఫిలిమ్ నగర్, సనత్ నగర్ నుంచి ఫైర్ ఆఫీసర్లు వచ్చి మంటలు ఆర్పివేశారని చెప్పారు.

బాలుడిని బలిగొన్న ట్రాన్స్‌ఫార్మర్
వీధిలో ఆడుకుంటున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం నాడు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా జురాల గ్రామానికి చెందిన గొల్లిగెరి లింగన్న, జయమ్మ దంపతులు ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు.
రెండేళ్లుగా పాత మీర్‌పేట్‌లో ఉంటున్నారు. లింగన్న, జయమ్మలు కూలీలు. వాకికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గణేష్ పోచమ్మ టెంపుల్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఆదివారం ఉదయం ఆడుకుంటుండగా విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతంతో ప్రాణాలు విడిచాడు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.












Click it and Unblock the Notifications