Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సారిక, పిల్లల అనుమానాస్పద మృతి: జవాబులు దొరకని ప్రశ్నలు ఇవీ..

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లల మృతిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సారిక మృతి కేసు దర్యాపునకు సంబందించిన మార్గం పోలీసులు దొరకడం లేదని అంటున్నారు. తొలుత ఆత్మహత్యగా భావించినా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ లీక్ అవడం వెనుక కుట్ర కోణం ఉందనే అభిప్రాయాలను పోలీసు అధికారులు వ్యక్తంచేస్తున్నారు. సారిక, ముగ్గురు చిన్నారులు కింద ఉన్న సమయంలో సారికకు తెలియకుండా సిలిండర్‌ను ఎవరైనా ఆమె పడకగదికి చేర్చి గ్యాస్ లీక్ అయ్యేలా చేసి, తలుపు దగ్గరికి వేసి వచ్చి ఉండొచ్చని క్లూస్ టీమ్ అనుమానించినట్లు తెలుస్తున్నది. రాజయ్యతో గొడవ తర్వాత పిల్లలతో కలిసి గదిలోకి వచ్చిన సారిక వెంటనే తలుపు గడి పెట్టుకుని ఉండువచ్చుననే కోణం కూడా ఉంది.

పిల్లలతో పాటు లోనికి వెళ్లిన సారిక లైట్‌వేసేందుకు ప్రయత్నించినప్పుడు స్విచ్ బాక్స్‌లో వచ్చే చిన్న పాటి స్పార్క్‌తో అప్పటికే గదిలో పూర్తిగా వ్యాపించి ఉన్న గ్యాస్ ఒక్కసారిగా మండిపోయి ఉంటుందని క్లూస్ టీమ్ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సారిక ఆత్మహత్య చేసుకుందని సృష్టించేలా ఈ ప్రయత్నం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sarika and children death: More questions arising

తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉన్న రీత్యా లోపలే ఆత్మహత్య చేసుకుందనే భావన కలిగేలా ప్లాన్ చేసి ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది. అయితే, సారిక గదిలో పేలినవి రెండు సిలిండర్లు. వీటిలో ఒకటి రెండు నెలల క్రితం తీసుకున్నది కాగా, మరోటి పదిహేను రోజుల క్రితం తీసుకున్నది. రెండునెలలుగా ఉపయోగించిన సిలిండర్‌లో దాదాపు 40 శాతం మాత్రమే గ్యాస్ ఉన్నట్టు గుర్తించారు. రెండు సిలిండర్లు ఆమె పడక గదిలో ఎందుకు ఉన్నాయనేది అంతు పట్టడం లేదని అంటున్నారు.

ఘటన జరిగిన సమయంలో సారిక అత్త, మామ, భర్త అంతా ఇంట్లోనే ఉన్నారు. తెల్లవారుజామున సిలిండర్ పేలిన శబ్దం, మంటల్లో చిక్కుకుని సారిక, పిల్లలు చేసిన ఆర్తనాదాలు రాజయ్య దంపతులకు, భర్త అనిల్‌కు వినిపించలేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ అంశంలో రాజయ్య కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించారు. ఘటన తర్వాత తెల్లవారుజామున 5.10గంటల సమయంలో రాజయ్య కుటుంబంనుంచి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ వచ్చిందని, 10 నిమిషాల్లో ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరిందని పోలీసులు గుర్తించారు.

అప్పటికే సారికతోపాటు పిల్లలు సజీవ దహనమైనట్టు అగ్నిమాపక అధికారులు పోలీస్ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలిసింది. కాగా, సారిక మృతికేసులో పూర్తి వివరాలు, ఆధారాలు అందించడంలో ఫోరెన్సిక్ నిఫుణులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. సిలిండర్‌పై ఉన్న వేలిముద్రలను సేకరించిన రెండు క్లూస్ టీమ్స్ అవి రాజయ్య, ఆయన భార్య, అనిల్ వేలిముద్రలతో పోల్చనున్నారు.

అలాగే సారిక గది గడియపై ఉన్న వేలిముద్రలను సైతం సేకరించిన క్లూస్ టీమ్స్ వాటిని కూడా పోల్చే పనిలో పడినట్టు సమాచారం. ఆహారంలో విష పదార్థాలు కలిశాయా? అన్న కోణంలోనూ ఫోరెన్సిక్ అధికారులు దర్యాప్తు వేగవంతంచేశారు. ఆ మేరకు సారికతో పాటు పిల్లల మృతదేహాల నుంచి శాంపిల్స్ కూడా సేకరించారు. వీటికి సంబంధించిన రిపోర్టు వారంలో వచ్చే అవకాశం ఉందని వరంగల్ పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు.

సారికను గాయపరచడం, లేదా మత్తు మందు ఇచ్చినట్టు ఆనవాళ్లు ఏమైన ఉంటే అది కచ్చితంగా హత్య కిందకే వస్తుందని అంటున్నారు. కాగా, కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయాన్, శ్రీయాన్‌లు ప్రాణాలతో ఉన్నప్పుడే మంటలు అంటుకున్నాయి. ఆపై కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారి ప్రాణాలు పోయినప్పటికీ సుమారు అరగంట పాటు వారి శరీరాలు కాలుతూనే ఉన్నాయని అంటున్నారు.

గ్యాస్ మంటలకు అతి దగ్గరగా వీరంతా ఉన్నారని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే తెలిపాయి. కనీసం కొన్ని నిమిషాల పాటు వీరు నరకయాతన అనుభవించి వుంటారని, మృతదేహాల ఊపిరితిత్తుల్లో పొగ ఆనవాళ్లు ఉన్నాయని తెలిపాయి. ఈ చిక్కు ముడులు వీడితే తప్ప ఏం జరిగిందనేది స్పష్టం కాదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+