సారిక, పిల్లలు అనుమానాస్పద మృతి: రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు?
వరంగల్: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య భార్య సిరిసిల్ల మాధవిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి నేపథ్యంలో మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అభినవ్, అయోన్, శ్రీయోన్ మాజీ ఎంపీ సిరిసిల్ల ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. తన అత్తింటి వేధింపులు భరించలేక, ముఖ్యంగా అత్త వేధింపులు భరించలేని స్థితిలో ఉన్నానని కోడలు సారిక ఫిర్యాదుతో గతంలో 498 (ఏ)తో పాటు గృహహింస కేసు నమోదైన విషయం కూడా తెలిసిందే.

బుధవారం జరిగిన సంఘటనపై పోలీసులు ఆమె భర్త సిరిసిల్ల రాజయ్య, కొడుకు అనిల్‌తో పాటు ఆమెను అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ నిమిత్తం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ నేపథ్యంలో వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాధవిని విధుల నుంచి తప్పించే అవకాశాలున్నట్టు యూనివర్శిటీ అధికారులు చెపుతున్నారు. అయితే శుక్రవారం వర్సిటీ వీసీ చిరంజీవులు రానున్న నేపథ్యంలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications