ఇంట్లో సీఐ మసాజ్ బాగోతం: కమిషనర్ సీరియస్, వీడియో వైరల్

సరూర్ నగర్ సీఐ లింగయ్య తన స్టేషన్‌లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరీయస్ అయ్యారు. కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: సరూర్ నగర్ సీఐ లింగయ్య తన స్టేషన్‌లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరీయస్ అయ్యారు. కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీనిపై దర్యాఫ్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ (అడ్మిన్) ప్రకాశ్ రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు.

 Saroor Nagar CI Gets A Massage With Homeguard.

సీఐగా పని చేస్తున్న లింగయ్య వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్టేషన్లో పని చేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.

మన్సూరాబాద్‌లోని ఇంటి వద్ద సీఐ లింగయ్య యూనిఫాంలో ఉన్న హోంగార్డు సైదా నాయక్‌తో బాడీ మసాజ్ చేయించుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఇవి మీడియాలో ప్రసారం కావడంతో ఆ దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవడం గానీ, మద్యం సేవించే అలవాటు గానీ లేదని లింగయ్య చెప్పారు.

సైదా నాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడి నుంచి బదలీపై వెళ్లాడని లింగయ్య చెప్పారు. మూడు నెలలుగా సరూర్ నగర్‌లో హోంగార్డు లేడని చెప్పారు. తనపై గిట్టని వాళ్లు ఈ దుష్ప్రచారం చేశారన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+