తెలంగాణ మంత్రులకు నిరసన సెగ.. ఉప సర్పంచులకు చెక్ పవర్‌పై ఘెరావ్ చేసిన సర్పంచ్‌లు

హైదరాబాద్ : చెక్ పవర్‌‌పై సర్పంచ్‌లు గళమెత్తారు. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడంపై ఆందోళన చేపట్టారు. ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు. తమతో ఉప సర్పంచులు సమానమా ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.సంగారెడ్డి జిల్లాను ఓడీఎఫ్ రహితంగా ప్రకటించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. అయితే వారికి అనుహ్యంగా నిరసన ఎదురైంది.

అక్కడికి వచ్చిన సర్పంచులు మంత్రులను ఘెరావ్ చేశారు. ఓడీఎఫ్ విషయం కాదు .. తమ పని చూడాలని కోరారు. తమకు ఉప సర్పంచులతో సమానంగా చెక్ పవర్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీనిపై మాట్లాడుదామని మంత్రులు సర్దిచెప్పినా వినలేదు. సర్పంచుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. తాము పేరుకే ప్రజాప్రతినిధులు అవుతున్నామని వారు వాపోయారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

sarpanch agitation at ministers

లేదంటే తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సర్పంచ్‌ల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కలుగజేసుకొని .. సర్పంచ్‌లను అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కానీ సర్పంచుల ఆందోళన ప్రభుత్వానికి తాకింది. చెక్ పవర్‌పై మరిన్ని చోట్ల ఆందోళనలు జరిగే అవకాశం ఉందా ? ఏం చేయాలనే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+