వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కరే తొయిబా ఉగ్రవాది అజీజ్‌ అరెస్ట్: ప్రశ్నిస్తున్న తెలంగాణ పోలీసులు

|
Google Oneindia TeluguNews

లక్నో/హైదరాబాద్‌: ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా కమాండర్ అబ్దుల్‌ అజీజ్‌ను లక్నోలో ఉత్తరప్రదేశ్‌లో ఏటీఎస్‌ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అజీజ్‌.. నగరంలోని రెండు కేసుల్లో నిందితుడు.

గణేశ్‌ ఆలయం పేల్చివేత కుట్ర కేసులో అజీజ్‌ ప్రధాన నిందితుడు. 2003లో బెయిల్‌పై విడుదలైన అజీజ్‌ సౌదీకి పారిపోయాడు. సౌదీ ప్రభుత్వ వెనక్కి పంపడంతో తిరిగి లక్నో చేరుకున్న అజీజ్‌ను ఏటీఎస్‌ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అజీజ్‌ను లక్నోలో తెలంగాణ పోలీసులు ప్రశిస్తున్నారు.

Saudi based Lashkar-e-Toiba commander Abdul Aziz arrested by Uttar Pradesh ATS

కాగా, గణతంత్ర దినోత్సవంలో బీభత్సం సృష్టించేందుకు కుట్రలు పన్నిన 13మంది అనుమానిత ఉగ్రవాదులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా సాగాయి.

బెంగళూరు, తంకూరు, మంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో నగరాల్లో స్థానిక పోలీసుల సహాయంతో ఎన్ఐఏ అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరంతా జనూద్ ఉల్ ఖలీఫా ఈ హింద్(భారత ఆర్మీ ఖలీఫా)కు చెందినవారని, ఇది కూడా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లాగే పని చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

English summary
Uttar Pradesh ATS arrested Saudi-based Lashkar-e-Toiba (LeT) commander Abdul Aziz from Lucknow airport late Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X