వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేవ్ వాటర్ .. సేఫ్ హోలీ .. పొడి రంగుల కేళి .. నీటిని కాపాడే హోలీ ఆడండి

|
Google Oneindia TeluguNews

హోలీ... ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునే రంగుల పండుగ. అంతేకాదు వసంత కాలంలో జరుపుకునే వసంతోత్సవం. అలాంటి పండుగ నీటి దుర్వినియోగానికి కారణమవుతుంది. అసలే వేసవి కాలంలో నీటి ఎద్దడి తో బాధపడే మనం హోలీ పండుగ రోజు ఇష్టమొచ్చినట్టు నీటిని దుర్వినియోగం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించాల్సింది మనమే కదా.అందుకే సేవ్ వాటర్ అండ్ సేఫ్ హోలీ అంటున్నారు పర్యావరణ వేత్తలు .

 హోలీ కారాదు విషాద కేళి .. రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్త హోలీ కారాదు విషాద కేళి .. రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్త

హోలీ వేళ.. జలాశయాల్లో , చెరువుల్లో నీరు కలుషితం చెయ్యకండి

హోలీ వేళ.. జలాశయాల్లో , చెరువుల్లో నీరు కలుషితం చెయ్యకండి

హోలీ పండుగ.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా, పేద ధనిక సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనుబంధాలను, స్నేహబంధాలను గుర్తు చేసుకుంటూ సరదాగా చేసుకునే పండుగ. అలాంటి హోలీ పండుగ రోజు ప్రతి ఇంట్లోనూ నీటి దుర్వినియోగం జరుగుతుంది. రసాయన రంగులు వాడటం వల్ల మీరు అధికంగా దుర్వినియోగం అవుతుంది. ఇక హోలీ ఆడేవారు నీటితో తడిపిన రసాయన రంగులు కాకుండా, సహజసిద్ధమైన నేచురల్ కలర్స్ ను పొడి రంగులుగా చల్లితే నీటి దుర్వినియోగాన్ని కాస్తయినా తగ్గించగలం. ఇళ్ళలోనే కాకుండా, రంగుల పండుగ హోలీ జరుపుకొని , ఆ రంగులను వదిలించుకోవడానికి జలాశయాల్లో నీటిని సైతం కలుషితం చేస్తున్నారు. దానివల్ల భవిష్యత్తులో నీటి సమస్య ఎదుర్కొనేది మనమే అనేది గుర్తుంచుకోవాలి. అందుకే పొడి రంగుల్ని చల్లు కుందాం.. నీటిని కాపాడుకుందాం అంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పొడిరంగుల వాడకం వల్ల ఎన్నో ఉపయోగాలు

పొడిరంగుల వాడకం వల్ల ఎన్నో ఉపయోగాలు

పొడి రంగులతోనే హోలీని ఆడుకోవాలి.
పొడి రంగులతో హోలీ ఆడడం వల్ల రంగులలో ఉన్న తీవ్రత, గాఢత మన శరీరానికి పట్టదు. ఆ రంగులను శుభ్రం చేసుకోవడానికి కొద్దిపాటి నీరు అయితే సరిపోతుంది. సహజ సిద్ధమైన రంగులు వాడటం వల్ల చర్మ, కంటి సంబంధమైన సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా నీరు ఎక్కువగా అవసరం ఉండదు. అలా కాకుండా తడి రంగులతో రసాయన రంగులు వాడటం వల్ల విపరీతమైన నీటి వినియోగం జరుగుతుంది. ప్రతినిత్యం మనం ఇంట్లో వాడే నీటి కంటే పది రెట్లు ఎక్కువ నీటిని హోలీ సందర్భంగా వినియోగిస్తున్నాం.

 నీటి వృధా చెయ్యకండి .. పొడి రంగుల హోలీ ఆడండి.

నీటి వృధా చెయ్యకండి .. పొడి రంగుల హోలీ ఆడండి.

ఒకపక్క తాగునీటికి కొన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లి దాహార్తి తీర్చుకుంటున్న ప్రజలను గుర్తు చేసుకుందాం. భవిష్యత్తులో మనకు అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే హోలీ పండుగ రోజున నీటి దుర్వినియోగాన్ని ఆపుదాం . పొడి రంగులతోనే హోలీ ఆడి మానవుల జీవనాధారమైన నీటిని కాపాడుకుందాం. అసలే ఎండా కాలం . భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటిన ఈ కాలంలో నీరు ఇష్టారాజ్యంగా వాడితే తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. కనుక నీటిని కాపాడుకుందాం .

సేవ్ వాటర్ .. సేఫ్ హోలీ అంటున్న సెలబ్రిటీలు

సేవ్ వాటర్ .. సేఫ్ హోలీ అంటున్న సెలబ్రిటీలు


హోలీ వల్ల పర్యావరణానికి హాని కలుగకూడదని, నీరు దుర్వినియోగం జరగకూడదని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సైతం హోలీ పండుగను సేఫ్ గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా దుర్వినియోగం కాకుండా నీటిని కాపాడుకోవాలని ఎండాకాలంలో ఉండే నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. రసాయన రంగులు పూసుకుని చెరువులను జలాశయాలను కలుషితం చేయొద్దంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. అంతేకాదు మన శరీరాన్ని, కళ్లను కాపాడుకునేలా సహజసిద్ధమైన పొడి రంగులు చల్లుకుని హోలీ ఆడుకోవాలని , నీటిని కాపాడుకోవాలని oneindia సైతం కోరుతోంది. సేవ్ వాటర్ ... ప్లే ఏ సేఫ్ హోలీ .

English summary
Holi is a colourful festival no doubt. Like every year, this year too many people will leave their taps open and waste gallons of water during Holi, which will ironically be celebrated just a day before World Water Day (22 March). people polute the water ponds , lakes with chemical coluors. It is so dangerous to us . Using of dry colours reduce the usage of water and one more thing we have to remind about our dire water problems while we are playing Holi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X