సామాన్యులకు చుక్కలు: మాల్యా సహా 63 మంది రూ.7వేల బకాయిలు రద్దు, ఏపీ-టీ కంపెనీలూ..

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ బడా వ్యాపారవేత్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కింగ్ ఫిషర్ యజమాని విజయ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్లకు పెద్ద మొత్తంలో రుణాన్ని మాఫీ చేసింది. బడా వ్యాపారులకు చెందిన రూ.7వేల కోట్లను ఎస్‌బీఐ మాఫీ చేసింది.

రుణాలు మాఫీ అయిన వారిలో విజయ మాల్యా డబ్బులు కూడా మాఫీ అయ్యాయి. విజయ మాల్యాకు చెందిన రూ.1200 కోట్లు మాఫీ చేసింది. మొండి బకాయిలు రద్దయిన కంపెనీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి.

SBI writes off Rs 7016 crore loans owed by wilful defaulters

ప్రజలు అష్టకష్టాలు

ఓ వైపు రూ.500 నోట్లు, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌బీఐ విజయ్ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్లకు రుణాలు మాఫీ చేయడం విమర్శలకు దారి తీసేదే. ఎగవేతదారులకు రుణ మాఫీ చేయడంపై రాజకీయ పార్టీలు నిలదీసే అవకాశముంది. పాత నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.

కానీ మొండి బకాయిలు వసూలు చేయలేక వారి రుణమాఫీ చేశారు. సామాన్యులకు ఒకటి రెండు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలంటే బ్యాంకులు ఎన్నో నిబంధనలు పెడతాయి. అలాగే ఇప్పుడు పాతనోట్ల రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+