రంగంలో దిగిన దక్షిణ మధ్య రైల్వే..!!

SLBC tunnel: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం ఎనిమిది మంది ఉద్యోగులను సురక్షితంగా బయటికి తీసుకుని రావడానికి గత ఆరు రోజులుగా నిరంతరాయంగా శ్రమిస్తోన్నారు నిపుణులు. సంఘటన స్థలానికి చేరుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ పనుల గురించి ఆరా తీస్తోన్నారు. స్వయంగా ఎస్ఎల్‌బీసీ వద్ద మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తోన్నారు. రెండు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

SC Railways deploy Team of Metal Cutting Experts to rescue operations at SLBC Tunnel

సహాయక చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా నిపుణులు ఇందులో పాల్గొంటోన్నారు. మెటల్ కట్టింగ్‌లో అపారమైన అనుభవం ఉన్న ఉద్యోగులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోన్నారు. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో వారికి ఎంతో నైపుణ్యం ఉంది.

సహాయక చర్యలకు ఆటంకంగా పరిణమిస్తోన్న ఇనుము, ఉక్కు ఇతర మెటల్ పరికరాలను తొలగించడం, వాటిని కట్టింగ్ చేయడంలో అనుభవం ఉన్న నిపుణుల బృందాన్ని ఎల్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు పంపించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి ఏ శ్రీధర్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు తాము ఈ సహాయక చర్యల్లో భాగస్వామ్యులైనట్లు చెప్పారు.

మొత్తం రెండు టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఇందులో ఒక టీమ్‌కు దక్షణ మధ్య రైల్వే డివిజినల్ మెకానికల్ ఇంజినీర్ ఎస్ మురళి సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఇందులో- ఒక సీనియర్ ఇంజినీర్, 13 మంది వెల్డర్లు, ఇద్దరు టెక్నీషియన్లు ఉన్నారు. వీరందరూ కూడా సికింద్రాబాద్, లల్లాగూడ, రాయనపాడు వర్క్‌షాప్‌లకు చెందిన ఉద్యోగులు.

Take a Poll

ఒకటి చొప్పున ప్లాస్మా కటింగ్ మెషీన్, బ్రోకో కట్టింగ్ మెషీన్ అండ్ కన్స్యూమబుల్, పోర్టబుల్ ఎయిర్ కంప్రెషర్, బ్యాటరీ, అల్ట్రా థర్మిక్ కట్టింగ్ ఎక్విప్‌మెంట్, ప్లాస్మా కట్టర్స్- 6, 20 పాకెట్ల ఎలక్ట్రోడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు- 6, వెల్డింగ్ మెషీన్లు- 2, నాలుగు పాకెట్ల వెల్డింగ్ ఎలక్ట్రోడ్స్‌ను ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు పంపించినట్లు శ్రీధర్ తెలిపారు.

ఈ నెల 22వ తేదీన ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ఒక భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. వారిని జార్ఖండ్‌కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, సందీప్ సాహు, జోస్, సంతోష్ సాహు, అనుజ్ సాహూగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+