పాఠశాలల సమయాల్లో మార్పు, కసరత్తు - కారణం ఇదేనా..!!
పాఠశాలల్లో సమయాల మార్పు జరగనుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగున్న వేళళ్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్త సమయాల ఖరారు పైన ఎన్సీఈఆర్టీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బడి సమయాల పైన వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పుల పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల పైన భిన్న వాదనలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ నివేదిక పైన ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సమయాల్లో మార్పులు: తెలంగాణలో పాఠశాల సమయాల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ లో కొంత ముందుగా ప్రారంభం అవుతున్నాయి.

ప్రాధమిక పాఠశాలల్లో చదవేది చిన్నారులు కావటంతో వారి ఉదయం త్వరగా నిద్ర లేవటం ఇబ్బందని..వారికి ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు ప్రారంభిచాలని..ఉన్నత పాఠశాలల్లో పెద్ద పిల్లలు కావటంతో వారికి ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని..ప్రస్తుతం ఉన్న సమయాలు విరుద్దంగా ఉన్నాయని కొందరు ప్రజా ప్రతినిధులు విద్యాశాఖ కు ప్రతిపాదించారు.
కొత్త సమయాలపై సూచనలు: దీంతో, అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభిచాలని సూచన చేస్తున్నారు. ఈ మార్పుల పైన ఎన్టీఈఆర్టీ అధికారులు అధ్యయనం ప్రారంభించారు. ఈ ప్రతిపాదనల పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులతో చర్చించి అన్ని కోణాల్లో ఆలోచించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
లేని పక్షంలో ప్రభుత్వ పాఠశాలలకు నష్టం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఉదయం 7.30 లేదా 8 గంటలకే పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తల్లి తండ్రులు ఉదయం సమయాల్లో త్వరగానే పనులకు వెళ్తారని...అక్కడ ఆలస్యంగా బడులు తెరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ఆమోదించేనా: ఉదయం సమయాల్లోనే సాధ్యమైనంత త్వరగా క్లాసులు ప్రారంభిస్తే విద్యార్దులకు అనుకూలంగా ఉంటుందనే వాదన వినిపిస్తున్నారు. ఉన్నత పాఠశాలలకు అనేక మంది పిల్లలు పొరుగు ఊళ్ల నుంచి వస్తారని గుర్తు చేస్తున్నారు. అందుకే అరగంట ఆలస్యంగా ప్రారంభిస్తారని చెబుతున్నారు.
ప్రాధమిక పాఠశాలలకు పొరుగు ఊళ్ల నుంచి రారాని..వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ అధికారులు ఇచ్చే అధ్యయన నివేదిక పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో, పాఠశాలల సమయాల్లో మార్పు పైన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ఈ నిర్ణయం ఎలా ఉంటుందనే దాని పై పేరెంట్స్ లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications