నేటి నుంచి తెలంగాణలో స్కూల్స్ క్లోజ్.. రద్దీగా బస్టాండ్స్ , రైల్వే స్టేషన్స్ !!

దసరా పండుగ రావడంతో తెలంగాణలోని విద్యార్థులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పండుగ సందర్భంగా నేటి నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబర్‌ 3వ తేదీ నుంచి పాఠశాలలు సాధారణంగా తిరిగి ప్రారంభమ కానున్నాయి.

స్కూళ్లు, హాస్టళ్లు మూత..

ఈ సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు మూతపడ్డాయి. గురుకులాలు, ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం రాత్రి నుంచే ఇంటి బాట పట్టారు. దాంతో పాఠశాల ప్రాంగణాలు, హాస్టళ్ల ప్రాంతాలు వెలవెలబోయాయి.

schools-in-telangana-closed-from-today-due-to-dasara-holidays

తల్లిదండ్రుల రాక..

దూరప్రాంతాల్లో చదువుతున్న పిల్లలను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ప్రత్యేకంగా స్కూళ్లు, హాస్టళ్ల వద్దకు వచ్చారు. పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలతో కలుసుకున్న క్షణాల్లో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల రద్దీ..

విద్యార్థులు ఇంటి దారి పట్టడంతో రాష్ట్రంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. RTC ప్రత్యేక బస్సులు, రైలు బోగీల్లో అదనపు కోచ్‌లు కూడా జతచేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బంది విధుల్లోకి దిగారు.

పండుగ వాతావరణం..

దసరా సందర్భంగా ఇళ్లకు చేరుకున్న విద్యార్థులు కుటుంబ సభ్యులతో పండుగ వేడుకలకు సిద్ధమవుతున్నారు. పాఠశాలల నుంచి దూరంగా ఉండే అవకాశం రావడంతో విద్యార్థులు పూర్తిగా పండుగ మూడ్‌లోకి వెళ్లిపోయారు. కాగా పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి భక్తులు శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ తొమ్మిది రోజులపాటు భక్తులు ఉపవాసాలు పాటిస్తూ, శ్లోకాలు జపిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+