Schools Bandhu: మంగళవారం పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ..

ఈనెల 5న మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బంద్ చేపడుతుంది.అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మౌలిక వసతులు కల్పించాలేదని ఏబీవీపీ ఆరోపించింది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నసమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేష్‌ డిమాండ్ చేశారు.

జూన్ 2న పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన 34మంది విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. రిమాండ్‌లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలన్నారు.ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకువచ్చి కార్పొరేట్ పాఠశాలలను సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమం ఎందుకు పనికిరాలేదని విమర్శించారు.

Schools in Telangana may be closed tomorrow

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలోనే విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యంలేక ఇటీవల బహిర్బూమికి బయటకు వెళ్లి నీటి గుంతలో పడిచనిపోయారని గుర్తు చేశారు. రేపు ఏబీవీపీ పాఠశాలల బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు పాఠశాల యాజమాన్యాలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+