ఇక చర్లపల్లి నుంచి ప్రధాన రైళ్లు - టైమింగ్స్ ఇలా..!!
చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రధాన రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి నుంచి నడుస్తున్న కొన్ని ముఖ్యమైన రైళ్లను చర్లపల్లి నుంచి నిర్వహించాలని అధికారు లు నిర్ణయించారు. ఈ మేరకు రైళ్లు...షెడ్యూల్ ఖరారు చేసారు. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ చర్లపల్లికి రాకపోకలు సాగించే ప్రయాణీకుల కోసం పలు ప్రాంతాల నుంచి కొత్తగా బస్సు సర్వీసులు ప్రకటించింది. దీంతో, చర్లపల్లి నుంచి రైళ్ల సంఖ్య క్రమేణా పెరిగే అవకాశం ఉంది.
అధికారుల కసరత్తు
కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రధాన రైళ్ల రాకపోకల పైన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు రైళ్లను ఇక్కడి నుంచి వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటికే మూడు నెలలకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్య స్థానం వరకు రిజర్వేషన్లు పూర్తి కావటంతో.. ఇప్పుడు మార్పు చేయటం సరి కాదని అధికారులు భావించి నిర్ణయం మార్చుకున్నారు. దీంతో, చర్లపల్లి నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు.

రైళ్ల వేళలు
మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరిగి 8వ తేదీ సాయంత్రం 17.25 గంటలకు బయలుదేరి (నం.12604) మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. అదే విధంగా, గోరఖ్‌పూర్ నుంచి మార్చి 12వ తేదీ ఉదయం 6.35 గంటలకు బయలు దేరే రైలు (నం. 12589) 13వ తేదీ ఉదయం 6.40 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఆర్టీసీ బస్సులు
కాగా, అదే రోజు రాత్రి 21.45 గంటలకు బయలు దేరి 14వ తేదీ మధ్యాహ్నం 13.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు మార్చి 8, 13 తేదీల నుంచి రెగ్యులర్‌గా నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తోడు అదనంగా మరో మూడు రైళ్లకు అధికారులు బుధవారం చర్లపల్లిలో ఒక నిమిషం పాటు హాల్టింగ్ ఇచ్చారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications