వేసవిలో తిరుపతి వెళ్లే ప్రయాణీకుల కోసం బిగ్ డెసిషన్..!!
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రధాన రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్న వేళ తాజా నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైళ్లను చర్లపల్లికి మళ్లించారు. ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి తిరిగి యధా తథంగా రైళ్ల నిర్వహణ పైన ఒక అంచనాకు వచ్చారు. కాగా, పనులను వేగవంతం చేస్తూనే ప్రస్తుతం మాత్రం చర్లపల్లి నుంచే వేసవి ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని నిర్ణయించారు.
చర్లపల్లి నుంచే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా పలు రైళ్లను చర్లపల్లికి మార్పు చేసారు. ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ పనులు జూలై నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నుంచి తిరిగి కొన్ని ప్రధాన రైళ్లు గతంలో మాదిరిగానే సికింద్రాబాద్ నుంచి రాకపోకలకు అవకాశం కలగనుంది. చర్లపల్లికి వెళ్లేందుకు రైల్వే ప్రయాణీకు లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, ప్రస్తుతం వేసవి ప్రత్యేక రైళ్లుగా తిరుపతికి ప్రకటించిన వాటిని చర్లపల్లి నుంచే నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు చర్లపల్లి - తిరుపతి ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ను ప్రకటించారు.

తిరుపతికి ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం (వయా వికారాబాద్, గుంతకల్) మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి(07257), మే 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లికి(07258) ప్రత్యేకరైళ్లు నడప నున్నారు. ప్రత్యేకరైళ్లు మార్గమధ్యంలో సనత్‌నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సెడాం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.












Click it and Unblock the Notifications