లోక్ సభ ఎన్నికల్లో గెలుపుగుర్రాల వేట..! అమీత్ షాతో భేటీ ఐన టీ బీజేపి నేతలు..!!
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వ్యూహం పై రాష్ట్ర బీజేపి ద్రుష్టి సారించింది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, నియోజక వర్గాలపై కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న లోక్ సభ నియోజక వర్గాలపైన ఎక్కువగా ద్రుష్టి కేంద్రీకరిస్తే గెలిచి తీరుతామని బీజేపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోక్ సభ నియోజక వర్గాలను క్లస్టర్లుగా విభజించిన బీజేపి, ఆయా స్థానిక నేతలో సంప్రదింపులు జరుపుతోంది.
బలమైన బీజేపి అభ్యర్తులను ఢీకొట్టేందుకు ప్రధాని మోదీ అభివ్రుద్ది మంత్రంతో తో పాటు రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఇస్తున్న నిధుల వివిధ వివిరాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా తో సమావేశమై రాష్ట్ర రాజకీయాలు గురించి, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు.

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో బీజేపీ 'గెలుపు' కసరత్తు మొదలెట్టింది. జాతీయ నేతల పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు పార్టీ చీఫ్ అమిత్ షాతో భేటీ అయ్యారు . రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు, అభ్యర్థుల ఎంపికపై షాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి చర్చించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది.
అయితే అభ్యర్థుల జాబితాతో ఈ నెల 15న ఢిల్లీ రావాలని నేతలను షా ఆదేశించినట్టు సమాచారం. ఆ రోజే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు చేసింది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications