ప్రమాదం జరిగితే పరిస్థితేంటి?: ఐమాక్స్‌పై హైకోర్టులో ఫిర్యాదు, నోటీసులు జారీ
Recommended Video

హైదరాబాద్: నగరంలోని ఐమాక్స్ థియేటర్‌పై హైకోర్టులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఐమాక్స్ థియేటర్‌లో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సీట్ల మధ్య దారి వదలలేదంటూ సదరు వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీతో పాటు ఐమాక్స్ థియేటర్ యాజమాన్యానికి ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

హైకోర్టుకు లేఖ
తార్నాకకు చెందిన విజయ గోపాల్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. ఐమాక్స్‌లోని బిగ్ స్క్రీన్ థియేటర్‌లో ప్రేక్షకులు కూర్చుకునేందుకు 14 వరుసల్లో సీట్లు ఉన్నాయని, ఒక్కో వరుసలో 47 సీట్లు(మొత్తం 635సీట్లు) ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు.

ఎమర్జెన్సీలో దారేది?
అయితే అత్యవసర పరిస్థితి తలెత్తితే... బయటకు వెళ్లేందుకు మధ్యలో దారి వదలలేదంటూ ఆయన తన లేఖలో ఫిర్యాదు చేశారు. అగ్నిప్రమాదం లేదా ఏదైనా ప్రమాదం తలెత్తితే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు.

చర్యలు తీసుకోవాలి..
చట్టానికి విరుద్ధంగా ఉన్న కొనసాగుతున్న ఐమాక్స్‌పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పిటికీ స్పందన రాలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని విజయగోపాల్ కోరారు.

నోటీసులు జారీ చేసిన హైకోర్టు..
ఈ లేఖపై స్పందించిన హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ప్రతివాదుల(ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీతో పాటు ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం)కు నోటీసులు జారీ చేసిన ఉన్నతన్యాయస్థానం.. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications