వారణాసి-ఢిల్లీ మార్గంలో రెండవ వందేభారత్ రైలు; ప్రారంభించిన పీఎం మోడీ!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఉత్తరప్రదేశ్ పర్యటన కొనసాగుతోంది. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆయన సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ వారణాసి నుండి ఢిల్లీకి మరొక కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు.
ఇక ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును చేసింది. వారణాసి-ఢిల్లీ మార్గంలో రెండవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాశీలోని మతపరమైన ప్రదేశాలకు ప్రయాణ మరియు పర్యాటకానికి ప్రాప్యతను మెరుగుపరిచేందుకు వేగంగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ మేరకు పేర్కొంది.

అదునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పలు గూడ్స్ రైళ్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య తో పాటు పలువురు పాల్గొన్నారు.
The second #VandeBharat express on Varanasi-Delhi route is ready to make swift journeys improving access to travel & tourism to the religious hotspot in Kashi.#RailInfra4UttarPradesh#RailVikasSePurvodaya pic.twitter.com/wxSDJzfsCw
— Ministry of Railways (@RailMinIndia) December 18, 2023
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించిన వందే భారత్ రైలు మంగళవారం మినహాయించి మిగతా ఆరు రోజుల్లో ఉదయం 6 గంటలకు వారణాసిలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు తిరిగి వారణాసికి చేరుకుంటుంది.
ఇప్పటికే వారణాసి ఢిల్లీ మార్గంలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా, రద్దీ నేపథ్యంలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ మార్గంలో ప్రారంభించారు. ఈ రైలులో అధునాతన ఫీచర్లు ఉంటాయి. వైఫై సదుపాయం, జిపిఎస్ ఆధారిత ఇన్ఫర్మేషన్ సిస్టం, బయో వాక్యూం టాయిలెట్స్, ప్రతి సీటు వద్ద చార్జింగ్ పాయింట్లు, టచ్ బేస్డ్ రీడింగ్ లైట్లు వంటి అధునాతన సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.












Click it and Unblock the Notifications