మాణికం ఠాగూర్ నోటీసులు: కోమటిరెడ్డికే పంపాలంటూ కేటీఆర్ సెటైర్లు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌​పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాగూర్​ వ్యాఖ్యలపై ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియని అయోమయంలో మాణికం ఠాగూర్​ ఉన్నారని, తప్పుడు అడ్రస్‌​కు పంపినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మాణికం ఠాగూర్​ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీకు(మాణికం ఠాగూర్​) 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాటలను తాను గుర్తు చేశానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన రూ. 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని తెలిపారు. అయితే, జనవరి 28న సిరిసిల్లలో కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు గానూ నోటీసులు పంపినట్లు మాణిక్కం ఠాగూర్ తెలిపారు.

send to komatireddy venkat reddy: KTR Counter to Manickam Tagores notice

కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని, కోమటిరెడ్డి తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మీరు(మాణికం ఠాగూర్) పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని కేటీఆర్ సూచించారు.


గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డికి కూడా మాణికం ఠాగూర్ నోటీసులు పంపారు.నిరాధార ఆరోపణలు చేసినందుకు గానూ, తన పరువుకు భంగం కలిగించారంటూ మాణిక్కం ఠాగూర్​.. ఎల్బీనగర్ మాజీ​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి లీగల్​ నోటిస్​ పంపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డిపై, సుధీర్ ​రెడ్డి పలు విమర్శలు చేశారు. అందులో భాగంగా మాణిక్కం ఠాగూర్‌​కు రూ.25 కోట్ల లంచం ఇచ్చి రేవంత్ ​రెడ్డి పీసీసీ అధ్యక్ష​ పదవి తెచ్చుకున్నారని సుధీర్​ రెడ్డి ఆరోపించారు. నాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాణిక్కం ఠాగూర్​, నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ లీగల్​ నోటీస్​ పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+