Revanth Reddy: అండగా ఉంటా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి భరోసా..!
వి హనుమంతరావు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో సేవలు అందిస్తున్నారు. తాజాగా విహెచ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీహెచ్ సిద్ధమయ్యారు. ఖమ్మం లోక్ సభ నుంచి ఆయన టికెట్ కోరారు. అయితే ఆయనకు టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో అలకబూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియా ముందు కూడా వచ్చారు.
అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తో చర్చించారు. మహేశ్ కుమార్ గౌడ్ వీహెచ్ తో సంప్రదింపులు జరిపారు. బుజ్జగింపుల తర్వాత మహేశ్ కుమార్ గౌడ్.. వి. హనుమంత రావును బుధవారం సీఎం రేవంత్ వద్దకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో రాజకీయాలపై చర్చలు జరిపారు. వీహెచ్ కు అన్ని విధాల అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి వీహెచ్ కు హామీ ఇచ్చారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి హనుమంత రావు వద్దకు వెళ్లి కలిశారు. కాంగ్రెస్ వీహెచ్ కు సీనియర్ నేతగా గౌరవం ఉంటుందన్నారు. కాగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటి వరకు 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 మంది అభ్యర్థుల పేర్లను బుధవారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్ర భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ఎంపీ అభ్యర్థుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కీలక సామాజివ వర్గాలైన యాదవ, గౌడ సామాజిక వర్గాలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఉంది.












Click it and Unblock the Notifications