అదిరిపోయే శుభవార్త.. త్వరలో తెలంగాణాలో ఐదు కొత్త ప్రతిష్టాత్మక పథకాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ సర్కార్ ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, సామాజికభద్రత రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఐదు ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేకదృష్టి సారిస్తోంది. ఈ పథకాలు కేవలం సంక్షేమానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి.
ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీం
త్వరలో కొత్తగా 5ప్రతిష్టాత్మక పథకాలను అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలకనిర్ణయం తీసుకుంది. మొదటగా ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీం, ఈ పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. చాలామంది విద్యార్థులు ఖాళీకడుపుతో పాఠశాలకు వెళ్లే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించారు. ఉదయం అల్పాహారం అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, వారి చదువుపై దృష్టి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
సామాజిక భద్రత కోణంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కీలకంగా మారనుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలవకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అవకాశముంది.
మధ్యాహ్న భోజన పథకం విస్తరణ
విద్యార్థుల పోషకాహారం దృష్ట్యా మరో కీలక నిర్ణయం మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు పాఠశాల స్థాయిలో ఉన్న ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించడం ద్వారా పేద విద్యార్థుల ఆకలి సమస్యను తగ్గించడమే కాకుండా, వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ప్రోత్సాహం ఇవ్వనుంది.
దివ్యాంగ విద్యార్థులకు మోటారైజ్డ్ వాహనాలు
ఇదే సమయంలో దివ్యాంగుల సాధికారత దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దివ్యాంగ విద్యార్థులకు మోటారైజ్డ్ వాహనాలు అందించడం ద్వారా ఇప్పుడు ఉత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. వారి విద్యలో ఎదురయ్యే రవాణా సమస్యలను తగ్గించనున్నారు. ఇది వారికి స్వతంత్రంగా చదువుకోవడానికి, సమాజంలో సమాన అవకాశాలు పొందడానికి దోహదపడుతుంది.
పంటల వైవిధ్యీకరణ మరియు సేంద్రియ వ్యవసాయం
వ్యవసాయ రంగంలో కూడా రేవంత్ సర్కార్ సరికొత్త దృక్పథాన్ని తీసుకువస్తోంది. పంటల వైవిధ్యీకరణ మరియు సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహంతో రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ పంటలు పండించేలా, ప్రత్యామ్నాయమార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా వరిపంట కాకుండా ఇతర పంటలను సాగు చేయడానికి ప్రోత్సహించనున్నారు. దీనికోసం పదివేల రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతులు అనుసరించడం ద్వారా మట్టినాణ్యత మెరుగుపడటంతో పాటు, రైతులకు దీర్ఘకాలికలాభాలు చేకూరనున్నాయి.
-
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
కొత్త పెన్షన్ల మంజూరు వీరికే, అర్హుల జాబితా - పంపిణీ ఆ రోజు నుంచే..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
భారీగా పెరిగిన యూజర్ ఛార్జీలు, ఇక ఈ సేవలు మరింత భారం..!! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
కేరళ గడ్డపై సీఎం సవాల్! మా గ్యారంటీలపై డౌట్ ఉంటే తెలంగాణ రండి -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!











Click it and Unblock the Notifications