రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల్లో పెను సంచలనాలు, జగన్ తో మోడీ భేటీ అందుకేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయంగా పెను సంచలనాలు జరిగే అవకాశం ఉందని ప్రముఖ అస్ట్రోగురు వేణుస్వామి చెప్పారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ నెలాఖరు నుండి సంచనాలకు తెరలేవనున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. రెండు తెలుగురాష్ట్రాల్లోని పార్టీలు, నాయకులు సంచలనాలకు కారణంగా మారే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రకమైన మార్పులు వచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే జ్యోతిష్యాన్ని నమ్మని హేతువాదులు మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తున్నారు.

Sensational incident will happen in both telugu states: Venuguruswamy

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ తో సమావేశం కావడం కూడ ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి, వైసీపీతో మధ్య స్నేహాబంధం కొనసాగే దిశగా అడుగులు పడుతున్నాయా అనే చర్చ సాగుతున్న తరుణంలో వేణుగురుస్వామి చెప్పిన మాటలు కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి లోకేష్ చేరిన తర్వాత కొందరు మంత్రులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడ లేకపోలేదని ఆయన చెప్పారు.మరో వైపు a, b, c, m, n, p, r, s అక్షరాలతో పేర్లు మొదలయ్యే ధనవంతుల పిల్లలకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. మరో విషయం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sensational incident will happen in both telugu states said astrologist Venuguruswamy.After president elections sensational incidents will happen in both state politics.
Please Wait while comments are loading...