సంచలనం: వీణవంక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు 20 ఏళ్ళ జైలు శిక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: తెలంగాణలో సంచలనం సృష్టించిన వీణవంక గ్యాంగ్ రేప్ కేసులో న్యాయస్థానం శుక్రవారం నాడు సంచలనతీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన ఇద్దరికి 20 ఏళ్ళపాటు శిక్షను విధిస్తూ కరీంనగర్ కోర్టు సంచలనతీర్పు ఇచ్చింది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై గత ఏడాది ఫిబ్రవరి10న, ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

sensational judgment on Veenavanka gang rape case

అంతటితో అకృత్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మహిళసంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఫిబ్రవరి 24న, పోలీసులు కేసు నమోదు చేశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్సై కిరణ్ కుమార్ , కానిస్టేబుల్ పరశురాములును అప్పట్లోనే సస్పెండ్ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ,డీజీపీ అనురాగ్ శర్మ స్వయంగా జోక్యం చేసుకోవడంతో కేసు దర్యాప్తు వేగవంతంగా సాగింది. దోషులకు కోర్టు శిక్ష విధించడంతో బాధితురాలి తరుపువారి హర్షం వ్యక్తం చేశారు.

ఈ కేసులో నిందితులైన ఇద్దరు నిందితులు గొట్టే శ్రీనివాస్, ముద్దం అంజయ్యలకు 20 ఏళ్ళపాటు శిక్ష విధిస్తూ కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం నాడు తీర్పును వెలువరించారు. ఈ కేసులో మరో నిందితుడు బాలనేరస్థుడిగా గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karimnagar sc, st special court judge ordered Nagaraju to Veenavanka gang rape case convicts 20 years imprisonment.Veenavanka gang rape sensational in the state.
Please Wait while comments are loading...