హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలకు, పిల్లలకు ప్రత్యేక బయో యురినల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. జిహెచ్ఎంసి పరిధిలో పిల్లలకు, మహిళలకు ప్రత్యేకంగా బయో యురినల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వాటిలో సెల్ఫ్ క్లీనింగ్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంటుంది. అవి సౌరశక్తితో పనిచేస్తాయి. అత్యవసరాల్లో వాడుకోవడానికి వీలుగా సంప్రదాయబద్దమైన పవర్ బ్యాకప్స్ కూడా ఉంటాయి.

ఈ అధునాతన టాయిలెట్ల నిర్మాణానికి జిహెచ్ఎంసి త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. వాటి స్థాపనకు స్థలాలను ఎంపిక చేస్తారు. రైల్వే జంక్షన్లలో, బస్సు స్టేషన్లలో, ఐటి కారిడార్లలో ప్రత్యేకంగా పిల్లలకు, మహిళలకు ఈ బయో యురినల్స్‌ను ఏర్పాటు చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే అలవాటుకు స్వస్తి పలకడానికి జిహెచ్ఎంసి ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

Separate bio-urinals for women and children in Hyderabad

ఐదు శాతం మాత్రమే వ్యక్తిగత టాయిలెట్లు

హైదరాబాద్‌లోని 1,476 మురికివాడల్లో ఐదు శాతం మందికి మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. మిగతా వారంతా కమ్యూనిటీ టాయిలెట్లపై ఆధారపడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ప్రైవేట్ పట్టా భూములను విక్రయించేశారు. పట్టణ పేదల కోసం చేపట్టిన తక్కువ వ్యయంతో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమం గడువు ముగిసింది.

వెంగళరావునగర్ మురికివాడ ప్రాంతంలో, సికింద్రాబాద్‌లో నివసించే కుటుంబాలు ఆ కార్యక్రమం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 550 రూపాయలు వసూలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సొమ్మును వసూలు చేశారు.

ప్రతి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి 3850 రూపాయలేసి ఖర్చవుతుంది. దాన్ని ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉండింది. మొదటి విడత మరుగుదొడ్డి నిర్మాణ సమయంలో 25 శాతం విడుదల చేయాల్సి ఉంటుంది. మిగతా 25 శాతం నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లించాల్సి ఉంటుంది.

మరుగుదొడ్ల నిర్మాణానికి మురికివాడల్లో తగిన స్థలం లేకపోవడం వంటి సాంకేతికరపరమైన సమస్యలు తలెత్తాయి. జిహెచ్ఎంసి పరిధిలోని 1,476 మురికివాడల్లో కొద్ది మంది మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు.

English summary

 Bio-urinals, exclusively for women and children, will be set up in the Greater Hyderabad jurisdiction by the corporation. Similar to the men’s toilets, these will be equipped with a self-cleaning mechanism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X