హైదరాబాద్‌ను నాశనం చేసి, రియల్ అడ్డాగా: జగదీశ్వర్, అంతా తెలంగాణవాళ్లే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును నాశనం చేసిన పార్టీలు ఇక్కడ పాగా వేసి రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం అన్నారు. రాష్ట్రంలో ఇవాల ప్రతిపక్షం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాలు లేవని వరంగల్ ఉప ఎన్నికతో తేలిపోయిందన్నారు. అరవై ఏళ్లుగా రాష్ట్రం నాశనం కావడానికి కారణం ప్రతిపక్షాలేనన్నారు. హైదరాబాదులో మంచినీళ్లు లేవంటే ఆ పాపం ఎవరిదన్నారు. హైదరాబాద్ కోసం విపక్షాల పాలనలో ఒక్క చెరువు నిర్మించలేదన్నారు. పైగా పాత చెరువులను ధ్వంసం చేశారన్నారు.
హైదరాబాదుకు అది చేశాం, ఇది చేశామని చెబుతున్న వారు.. ఏం చేశారని మండిపడ్డారు. వారి తీరు చూస్తుంటే దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉందన్నారు. గత అరవై ఏళ్ల పాలన ఎలా ఉంది, ప్రస్తుతం సీఎం కేసీఆర్ 16 నెలల పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారన్నారు.

హైదరాబాద్ శుభ్రంగా ఉండేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. అభివృద్ధిలో కలిసి వచ్చేందుకే పలువురు నేతలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. గత పాలకులు హైదరాబాదు గురించి పట్టించుకోలదేన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమదే గెలుపు అన్నారు.
అందరూ తెలంగాణ వాళ్లే: మైనంపల్లి
హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా తెలంగాణ వారేనని మైనంపాటి హనుమంత రావు అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications