ఈతకు వెళ్లిన 7గురు చిన్నారులు మృతి.. తెలంగాణలో విషాదం
తెలంగాణలో ఈత సరాద ఒక్కరోజే ఏడుగురు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. ఎండలు విపరీతంగా ఉండడంతో గ్రామాల్లోని పిల్లలు చెరువుల్లోకి ఈతకు వెళుతున్నారు. దీంతో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈతకు వెళ్లిన చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.

తాజగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని రుద్రారంలో నలుగురు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మరో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో విషాదం చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటి వద్ద ఉన్న నీటి గుంతలో నలుగురు చిన్నారులు ఈతకు దిగారు. నీటిలో మునిగి నలుగురు చనిపోయారు. మృతులు
గోవర్ధన్, విష్ణువర్ధన్, ఆనంద్, నందిని అల్వాల్ లోని బాలాజీనగర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నందివడ్డిమాన్ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. నందివడ్డేమాన్ గ్రామ శివారులోని సూరయ్యకుంటలో ఈత కొట్టేందుకు ఒకే కుటుంభానికి చెందిన అనిల్, స్వాతితో పాటు, మరో కుటుంభానికి చెందిన శైలజా అనే అమ్మాయికూడ మృత్యు వాత పడింది.












Click it and Unblock the Notifications