Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్..!
మావోయిస్టులకు షాక్ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో నర్సంపేట ఏరియా కమాండర్ భద్రుతో పాటు ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదే ములుగు జిల్లాలో వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ హతమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నవంబర్ 22న కూడా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.

సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రత బలగాలు అక్కడికి వెళ్లాయి. తమను చూసిన మావోయిస్టులు కాల్పులు చేపట్టారని అధికారులు చెప్పారు. రక్షణ కోసం ప్రతిగా కాల్పులు జరిపినట్లు వివరించారు. కాగా దేశంలో క్రమంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోంది. అటవీ బాట పట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో చత్తీస్ గఢ్, ఒడిశాలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications