సికింద్రాబాద్, విజయవాడ రూట్లల్లో మెము ప్యాసింజర్లు క్యాన్సిల్
సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు సహా వివిధ మార్గాల్లో రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచనలు ఇచ్చారు. వేలాదిమంది ప్రయాణికుల రోజువారీ ప్రయాణంలో భాగమైన మెము ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ రద్దు తాత్కాలికమే. నేడు, రేపు.. అంటే 20, 21వ తేదీల్లో ఆయా రైళ్లేవీ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. మొత్తం 10 రైళ్లు రద్దయ్యాయి.
మెము ప్యాసింజర్ రైళ్ల రద్దుకు గల కారణాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పూర్తిగా వెల్లడించట్లేదు గానీ.. ఆపరేషన్ కార్యకలాపాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 10 వేర్వేరు మార్గాల్లో ప్రయాణికల రాకపోకలు ప్రభావితం అయ్యాయి. ఆదివారం వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు రద్దు కొనసాగుతుంది.

వీటితో పాటు ఆపరేషనల్ కారణాలతో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రద్దు నేటి నుండి అమలవుతాయి. 47191 లింగంపల్లి-ఫలక్‌నుమా, 47170 ఫలక్‌నుమా- లింగంపల్లి, 47187 లింగంపల్లి- ఫలక్‌నుమా, 47166 ఫలక్‌నుమా- లింగంపల్లి, 47207 ఫలక్‌నుమా- తెలాపూర్, 47159 తెలాపూర్ ఉందానగర్, 47192 లింగంపల్లి- ఫలక్‌నుమా, 47167 ఫలక్‌నుమా- లింగంపల్లి, 47220 ఫలక్‌నుమా- లింగంపల్లి, 47228 మేడ్చల్- సికింద్రాబాద్, 47229 సికింద్రాబాద్- మేడ్చల్, 47237 మేడ్చల్- సికింద్రాబాద్ ఉన్నాయి.
అలాగే 47238 సికింద్రాబాద్- మేడ్చల్, 47242 మేడ్చల్- సికింద్రాబాద్, 47245 సికింద్రాబాద్- మేడ్చల్), 47235 ఘట్కేసర్-సనత్‌నగర్, 47236 సనత్‌నగర్- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రద్దునకు గురైన రోజువారీ మెము ప్యాసింజర్ రైళ్లలో..
67759 సికింద్రాబాద్-చిత్తాపూర్
67760 చిత్తాపూర్-సికింద్రాబాద్,
67765 కాజీపేట్-డోర్నకల్
67767 డోర్నకల్-విజయవాడ
67768 విజయవాడ-డోర్నకల్
67766 డోర్నకల్-కాజీపేట్
67769 విజయవాడ-గుంటూరు
67770 గుంటూరు-విజయవాడ
67761 సికింద్రాబాద్-వరంగల్
67762 వరంగల్-సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications