సెక్స్ కోర్కెలు తీర్చడం లేదని హేళన చేసింది: భార్యను చంపేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన సెక్స్ కోరికలను తీర్చలేని అశక్తుడవని హేళన చేయడంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆమెను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఆమె గుండెపోటుతో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు తానే హత్యచేసినట్లు అంగీకరించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం కూలూర్‌ గ్రామానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య(47) హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. మాదన్నపేటలోని కార్పొరేషన్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. 1999లో సికింద్రాబాద్‌కు చెందిన విజయలక్ష్మితో అతనికి పెళ్లయింది. అయితే, ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరూ విడిపోయారు.

Murder

ఆ తర్వాత 2005లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మాధవి(27)ని లక్ష్మయ్య వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. భార్యాపిల్లలతో కలిసి హయతనగర్‌లో ఉంటున్నాడు. అయితే భార్య తరచూ పుట్టింటికి వెళుతుండటంతో ఆమెపై లక్ష్మయ్య అనుమానం పెంచుకున్నాడు.

అలా మాటిమాటికి ఎందుకు వెళ్తున్నావని అడిగితే, తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, నువ్వు నాకన్నా పెద్దవాడివని, సెక్స్‌ కోర్కెలను తీర్చలేకపోతున్నావని హేళన చేస్తూ వచ్చేది. హోలీ పండుగ మరుసటి రోజు లక్ష్మయ్య డ్యూటీకి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలోనూ ఆమె నువ్వు వయస్సులో పెద్దోడివి అంటూ హేళన చేసింది.

దాంతో ఆమెను అట్లకాడ తీసుకుని తీవ్రంగా కొట్టాడు. కిందపడిపోయిన మాధవిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం 108కి సమాచారం ఇచ్చాడు. వారి వచ్చి పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించారు. గుండెపోటుతో తన భార్య చనిపోయినట్టు పోలీసులను లక్ష్మయ్య నమ్మించే ప్రయత్నం చేశాడు. పిల్లలకు కూడా అదే విషయం చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police solved the suspicious death of a 27-year-old housewife who was found dead at home on Monday, and arrested her husband for killing her for mocking him about his age and his inability to fulfil her sexual desires.
Please Wait while comments are loading...