సెక్స్ రాకెట్: వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..
హైదరాబాద్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వేర్వేరు ముఠాలను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార స్థావరాలు సంబంధించి శనివారం రాత్రి సమాచారం అందగానే పోలీసులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

మాదాపూర్ ఖానామెట్:
మొదట మాదాపూర్ ఖానామెట్‌లోని క్యాజిల్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేశారు.అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్‌నెంబర్-503లో నాగేంద్రబాబు, జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు.

అదుపులో ముగ్గురు..:
నాగేంద్రబాబు, జానయ్యలతో పాటు బెంగళూరుకు చెందిన పప్పిమోసూర్(28)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ముగ్గురు మహిళల అరెస్ట్..:
అదే అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్‌లో విజయ్ భాస్కర్ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న చాయచౌహాన్(23), జరీనకౌసర్, మౌనికజా అనే ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు విజయభాస్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు చెప్పారు.

ఇద్దరికి విముక్తి..:
బంజారాహిల్స్ రోడ్ నెంబర్-9లో వ్యభిచారం నిర్వహిస్తున్న మరో ఇంటిపై కూడా పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుల చెర నుంచి ఇద్దరు యువతులకు విముక్తి కల్పించారు. ఇద్దరు నిర్వాహకులను ఇప్పటికే అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మరో నిర్వాహకురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications