వ్యభిచార గృహంపై పోలీసుల దాడి: ఇద్దరు విటులు, మహిళ అరెస్టు
హన్మకొండ పోస్టల్ కాలనీలో కొంతకాలంగా రహస్యంగా వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్: హన్మకొండ పోస్టల్ కాలనీలో కొంతకాలంగా రహస్యంగా వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సుబేదారి సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... పోస్టల్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి కొంత కాలంగా తన ఇంట్లోనే వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందింది.
ఈ మేరకు ఆదివారం రాత్రి పోలీసు సిబ్బందితో దాడులు నిర్వహించగా ఇంటి యజమానితోపాటు ఓ మహిళ, ఒక విటుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పట్టుకున్న ముగ్గురిని సుబేదారి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి వారిని సోమవారం కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు.
ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు
వరంగల్: చెట్ల మందులు అమ్ముతున్నట్లు నటిస్తూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.65 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మట్టెవాడ సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
సీసీఎస్ సీఐ డేవిడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా లేపాక్షి మండలం బయ్యపెల్లి గ్రామానికి చెందిన కండమంచి నారాయణస్వామి, బెజవాడ మంజునాథ్‌లు ఇద్దరు మంచి స్నేహితులు. డబ్బులు సరిపోక పోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. నాలుగు మాసాలుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చెట్ల మందులు అమ్ముతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవారు.
ప్రధానంగా జనగామ ప్రాంతంలో ఎక్కువగా తిరిగేవారు. జనగామ పట్టణంలో 2016 అక్టోబర్‌లో ఓ ఇంట్లో దొంగతనానికి ఒడిగ్టారు. ఆ తర్వాత 2017 జనవరిలో అదే ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడ్డారు. రెండు చోట్ల మొత్తంగా 55 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. దొంగిలించిన బంగారాన్ని ఆదివారం హన్మకొండ టైలర్‌స్ట్రీట్‌లో అమ్ముకునేందకు వచ్చారు.

సీసీఎస్ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. పోలీసులను చూసి వారు పరుగెత్తడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. విచారించడంతో చేసిన తప్పులను ఒప్పుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. సీఐకి సీసీఎస్ సిబ్బంది సహకరించినట్టు ఆయన చెప్పారు.
ఉప్పల్‌లో గంజాయి పట్టివేత: ఇద్దరు యువకుల అరెస్టు
కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో గంజాయి కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సతీష్‌చందర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మహ్మద్ ఇదాయిత్ అలీ (22) వరంగల్, కె. షంషోద్దీన్ (23) కాజీపేట, వీళ్లిద్దరు శనివారం రాత్రి ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సైలు వీరిని విచారించగా వీరి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు స్థానిక ఎమ్మార్వోకు సమాచారం అందించి గంజాయి తరలించేందకు సిద్ధంగా ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
కాగా, గంజాయి కేసులో యువకులను ఆదివారం అరెస్టుచేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు. ఇక ముందు ఎవరైనా ఇలాంటి చర్యకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువకులు చెడు మార్గాలు విడనాడి సన్మార్గంలో పయనించాలని కోరారు.












Click it and Unblock the Notifications