మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి లేడీ డాక్టర్‌పై రేప్: టెక్కీ అరెస్టు
హైదరాబాద్: మహిళా వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పిడన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మనోజ్ (30)ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయనున్నారు. ఈ అత్యాచార ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో గల బండ్లగూడా జాగీర్‌లో జరిగింది.
బండ్లగూడ జాగీర్ గ్రామంలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్న మనోజ్ తన ఇంటికి ఎదురు ఫ్లాట్‌లో ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనకు వైద్యం చేసేందుకని పిలిచి మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి దారుణానికి పాల్పడ్డాడు.

ఆ విషయాన్ని బయటపెడుతానని బెదిరించి అనతు ఆమెపై లైంగికి దాడికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. చివరకు ఆమె రాజేంద్రనగర్ పోలీసులకు ఈ సంఘటనపై ఫిర్యాదు చేసింది.
ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, అపార్టుమెంట్ వాసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications