దొంగచాటుగా చార్జీల పెంపు: కెసిఆర్‌పై షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దొంగచాటుగా విద్యుత్ చార్జీలు పెంచిందని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. శాసన మండలిలో బడ్జెట్ ఆమోదం పొందగానే కేసీఆర్ చార్జీలు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమన్న ముఖ్మయంత్రి ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కెసిఆర్వ్యవహార శైలిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలపై రూ.20 వేల కోట్లు అదనపు భారం వేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఇందుకు బడ్జెట్ లెక్కలు చూస్తే అర్థమవుతుందని చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శనివారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రూ.816 కోట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆయన అన్నారు.

విద్యుత్తు చార్జీలు పెంచితే కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు కేవలం ఒక్కసారి మాత్రమే విద్యుత్తు చార్జీలు పెంచిందని ఆయన గుర్తు చేశారు. పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని, లేదంటే సబ్సిడీగా ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని ఆనయ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications