కేసీఆర్ 'జాతీయ' వ్యూహాలకు శరద్ పవార్ షాక్!: ఆయనకు అదే ప్లస్, కానీ

Recommended Video

    Third Front : కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూటమిపై శరద్ పవార్ విందు ప్రభావం

    హైదరాబాద్/న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కూడబెట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన ఆయన మరికొన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

    త్వరలో కేసీఆర్ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలకు వెళ్లనున్నారు. అఖిలేష్ యాదవ్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బెంగాల్ పర్యటనపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివరాలు ఇచ్చారు. మరోవైపు, కేసీఆర్ థర్డ్ ఆశలకు చెక్ చెప్పేందుకు శరద్ పవార్ రంగంలోకి దిగారు.

    శరద్ పవార్‌కు అదే ప్లస్

    శరద్ పవార్‌కు అదే ప్లస్

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు మినహాయించి 2014 నుంచి బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ ప్రత్యేకంగా రాష్ట్రాలపై దృష్టి సారించింది. అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఓటములకు తమ దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, స్థానిక పరిస్థితులు తదితర కారణాలు ఉన్నాయి. బీజేపీ దూసుకెళ్తుండటంతో దానికి అడ్డుకట్ట వేయాలని లెఫ్ట్, బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇందుకోసం ఎవరినైనా కలుపుకొని వెళ్లాలని కొందరు భావిస్తున్నారు. కేసీఆర్ మాత్రం నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అంటున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీతో జతకలిసి విపక్షాల కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సహా అనడం పవార్‌కు ప్లస్.

    మమత, అఖిలేష్ హాజరు, కాంగ్రెస్‌తో చర్చలు!

    మమత, అఖిలేష్ హాజరు, కాంగ్రెస్‌తో చర్చలు!

    ఈ నెల 27వ తేదీన శరద్ పవార్ ఈ నెల 27వ తేదీన విపక్షాలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ హాజరు కానున్నారు. 26న ఢిల్లీ వెళ్లనున్న మమత.. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ సమయంలో ఆమె సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోను భేటీ కానున్నారని తెలుస్తోంది.

    పవార్ యూటర్న్, పలుకుబడి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్

    పవార్ యూటర్న్, పలుకుబడి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్

    2014లో ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ - శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో బీజేపీకి అండగా నిలిచేందుకు శరద్ పవార్ ముందుకు వచ్చారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్‌కు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

    కేసీఆర్ కూటమిపై పవార్ విందు ప్రభావం

    కేసీఆర్ కూటమిపై పవార్ విందు ప్రభావం

    కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూటమిపై పవార్ విందు ప్రభావం పడడం ఖాయం. అయితే అది సానుకూలమా, వ్యతిరేకమా అనేది 27న తేలనుంది. పవార్ ఇంట్లోని విందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎక్కువగా ముందుకు వస్తే కేసీఆర్ కూటమికి షాక్ తప్పదు. తక్కువ పార్టీలు హాజరైతే మాత్రం కాంగ్రెస్ పార్టీతోను వెళ్లేందుకు దేశంలో చాలా పార్టీలు సుముఖంగా లేవని తేలిపోతుంది. అప్పుడు కేసీఆర్ కూటమి మరింత పుంజుకునే అవకాశాలున్నాయి. లేదంటే కేసీఆర్ కూటమికి ఆశలు సన్నగిల్లినట్లే అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+