పీవీ నరసింహా రావు వల్లే శరద్ పవార్‌కు ప్రధాని పదవి చేజారింది!
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పివి నరసింహా రావు వల్లే 1996లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు ప్రధానమంత్రి పదవి చేజారిందని ఎన్సీపీ చెబుతోంది. శరద్ పవార్ అమృత మహోత్సవం పురస్కరించుకుని పార్టీ ఆవిష్కరించిన ఆధార్‌వాడ పుస్తకంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
నాడు బిజెపి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం పదమూడు రోజులకే స్థిరత్వం కోల్పోయిందని, దీంతో వ్యతిరేక పార్టీల సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శరద్ పవార్ ముందుకొచ్చారని, ఇంతలో దేవేగౌడ నేతృత్వంలోని జనతా దళ్‌కు బయట నుంచి మద్దతు తెలిపేందుకు పీవీ అంగీకరించారని పేర్కొన్నారు.

ఫలితంగా శరద్ పవార్ ప్రధాని అయ్యే అవకాశం కోల్పోయారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2004లో సమయంలో ప్రధాని పదవిని ఎవరు చేపట్టాలనే చర్చ వచ్చిందని, అప్పుడు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పేరుపై డిమాండ్ వచ్చిందని, అయితే సోనియా గాంధీ ప్రధానైతే ఆమె పౌరసత్వంపై దేశంలో అల్లర్లు, ఘర్షణలు చెలరేగుతాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications