మోడీ వ్యాఖ్య: పైబర్ బ్రాండ్ రేణుకా చౌదరికి రెబెల్ శతృఘ్న బాసట

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెసు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి అనుకోని వైపు నుంచి మద్దతు లభించింది. సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బిజెపి నేత, రెబెల్ స్టార్ శతృఘ్న సిన్హా ప్రధాని నరేంద్ర మోడీని తప్పు పట్టారు.

  Renuka Chowdhury Issue : Here Are The Reactions Of Politicians And Parties

  ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్య విషయంలో ఆయన రేణుకా చౌదరికి మద్దతు పలికారు. రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా రేణుకా చౌదరి నవ్వారు. ఆ నవ్వును మోడీ రామాయణంలోని పాత్రకు అంటగడుతూ వ్యాఖ్యలు చేశారు.

   రేణుకా చౌదరిపై బిజెపి నేతలు ఇలా...

  రేణుకా చౌదరిపై బిజెపి నేతలు ఇలా...

  ప్రధాని రామాయణంలోని ఏ పాత్ర నవ్వుతో రేణుకా చౌదరి నవ్వును పోల్చారో చెప్పలేదు. దీంతో ఆమెను రామాయణంలో శూర్పణఖగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏకంగా వీడియోనే పోస్టు చేశారు. దీనిపై రేణుకా చౌదరి సభా హక్కుల కింద నోటీసు కూడా ఇచ్చారు.

  శతృఘ్న ట్విట్టర్‌లో స్పందించారు...

  శతృఘ్న ట్విట్టర్‌లో స్పందించారు...

  రేణుకా చౌదరి నవ్వు విషయంలో చెలరేగిన వివాదంపై శతృఘ్న సిన్హా ట్విట్టర్‌లో స్పందించారు. రేణుకా చౌదరి నవ్వుతూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా సాధికారితను వ్యతిరేకంచేవాళ్లు త్వరలోనే పతనమవుతారని కూడా ఆయన వ్యాఖ్యించారు.

   వారికి చివరి నవ్వు అవుతుంది..

  వారికి చివరి నవ్వు అవుతుంది..

  వారికి ఇదే చివరి నవ్వు అవుతుందని శతృఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. నారీ శక్తికి ఆయన జైకొట్టారు. ఇప్పటికే శతృఘ్న సిన్హా బిజెపికి తలనొప్పిగా మారారు. బిజెపి అగ్రనేతలపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేతలను ఆయన వెనకేసుకొచ్చారు.

  రేణుకా నవ్వు, మేం ప్రేమిస్తాం!

  రేణుకా నవ్వు, మేం ప్రేమిస్తాం!

  "నవ్వు రేణుకా నవ్వు! నిన్ను మేం ప్రేమిస్తాం, నిన్ను మేం ఇష్టపడుతాం, నీకు మంచిని ఆకాంక్షిస్తాం, సంతోషంగా ఉండు! వారిని ఏడ్వనీ, గట్టిగా అరవనీ. పరిస్థితి కుదుటపడుతుంది" అని శతృఘ్న సిన్హా ట్వీట్ చేశారు.

   యశ్వంత్ సిన్హానతో పాటు శతృఘ్న

  యశ్వంత్ సిన్హానతో పాటు శతృఘ్న

  బిజెపికి యశ్వంత్ సిన్హాతో పాటు శతృఘ్న సిన్హా తలనొప్పిగా మారారు. యశ్వంత్ సిన్హా బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతూ వస్తున్నారు. ఆయనకు శతృఘ్న సిన్హా మద్దతు పలుకుతూ వస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  MP Shatrughan Sinha tweeted in support of Congress MP Renuka Chowdhury who was mocked by Prime Minister Narendra Modi for laughing during his speech in Rajya Sabha.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి