మెట్రోపై షీ టీమ్స్ నిఘా.. వేధింపులకు పాల్పడితే..

హైదరాబాద్: మెట్రో రైళ్లపై షీ టీమ్స్ నిఘా వేశాయి. మెట్రో రైళ్లలోగాని, స్టేషన్లలోగాని ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని షీ టీమ్స్ నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికులకు షీ టీమ్స్ అవగాహన కల్పిస్తున్నాయి.

మెట్రో రైళ్లతోపాటు స్టేషన్లలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా వెంటనే షీ టీమ్స్‌కు సమాచారం ఇవ్వాలంటూ షీ టీమ్స్ బ‌ందాలు ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేశారు.

She Teams Eye on Hyderabad Metro Rail

మెట్రో ప్రయాణికులపై షీ టీమ్స్ నిఘా ఉంటుందని, ఎవరైనా విద్యార్థినులను, ఉద్యోగులను, ఇతర మహిళలను వెంబడించడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.

నేరుగా షీ టీమ్స్‌ను సంప్రదించడం, డయల్ 100, షీ టీమ్స్ ఫేస్‌బుక్, హెచ్‌వైడీషీటీమ్స్@జీమెయిల్.కాం, 9490616555 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేసేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ప్రయాణికులకు వివరించినట్లు షీ టీమ్స్ ఇన్‌చార్జ్జి స్వాతి లక్రా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+