వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో బౌండరీలు దాటిన పాలిటిక్స్; బీజేపీకి షాక్.. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు లో ఎన్నికల రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడంలో ఊహించని చర్యలకు పాల్పడుతున్నారు. ఒకపక్క మాటల తూటాలు పేలుతుంటే, మరోపక్క పోస్టర్లలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇక తాజాగా మునుగోడు లో ఎన్నికల రాజకీయం బౌండరీలు దాటి ఏకంగా గోతులు తవ్వి సమాధులు కట్టే దాకా వెళ్ళింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డకు సమాధి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డకు సమాధి

తాజాగా మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కు సమాధి కట్టడం ఇప్పుడు మునుగోడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో జేపీ నడ్డా కు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టారు. మట్టితో సమాధిని ఏర్పాటు చేసి ఆ సమాధిపై జేపీ నడ్డా ఫోటోను పెట్టి పూలమాలవేసి పసుపు కుంకుమ చల్లి హంగామా చేశారు. జేపీ నడ్డా తో ఫోటో తో ఏర్పాటుచేసిన పోస్టర్ లో రీజనల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చౌటుప్పల్ అని రాసి పెట్టారు.

మునుగోడు ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ హామీ నెరవేర్చలేదని సమాధి

మునుగోడు ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ హామీ నెరవేర్చలేదని సమాధి

మునుగోడు కు ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇవ్వనందుకు జేపీ నడ్డా కు సమాధి కట్టినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ పని చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలే అన్న టాక్ వినిపిస్తోంది. 2016 లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా జేపీ నడ్డా మర్రిగూడ లో పర్యటించి, చౌటుప్పల్ మండలంలో కచ్చితంగా ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అదే సంవత్సరం 8.2 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు కోసం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం లో కేటాయించింది.

బీజేపీ నేతల ఆగ్రహం .. టీఆర్ఎస్ నేతలపై మండిపాటు

అయితే ఇప్పటి వరకు అక్కడ ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో, ఇచ్చిన హామీని నెరవేర్చలేదని జేపీ నడ్డా సమాధి కట్టి నాకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇక ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికలలో ఓట్ల కోసం ఇంతగా దిగజారుతారా అంటూ టిఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీకి ప్రజల ఆదరణ చూసి ఒర్చుకోలేకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

English summary
In Munugode, BJP got a shock. BJP national president JP Nadda was buried by unidentified people. Munugode promise to provide fluoride research center was not fulfilled and his photo was put as a poster and his tomb was built.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X