Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు షాక్.. అలా చేస్తే పథకం వర్తించదు జాగ్రత్త!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇందిరమ్మ నిర్మాణం జోరుగా సాగుతుంది. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేయడం, ఉచిత ఇసుకను అందజేయడం వంటి కార్యక్రమాలతో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూస్తున్నారు.

ఇందిరమ్మ ఇల్లు కడుతున్న వారికి కీలక అలెర్ట్
ఈ పథకాన్ని అమలు చేయడానికి కీలక చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులు తప్పులు చేయొద్దని హెచ్చరిస్తోంది. తప్పులు చేస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పొందడానికి అనర్హులవుతారని చెబుతోంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Shock for Indiramma House beneficiaries If you violate rules the scheme will not apply be careful

Take a Poll

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలివే
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనల మేరకే చెయ్యాలని, 400చదరపు అడుగుల నుండి 600చదరపు అడుగుల లోపే ఇంటి నిర్మాణం చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే ఇందిరమ్మ ఇంటి పథకం వర్తించదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హనుమకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన
ఈ సందర్భంగా పేదలకు, బలహీన వర్గాలకు సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ళ పథకం అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేరువవుతుందని అన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే ఇళ్లపథకంలో లబ్ధిదారులకు డబ్బులు రావు
దళారులను నమ్మి మోసపోవద్దని, నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.తెలంగాణలో ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిర మహిళా క్రాంతి పథకం తదితర పథకాలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం అందాలంటే లబ్ధిదారులు పాటించవలసిన కీలక సూచనలు చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే ఇళ్లపథకంలో లబ్ధిదారులకు డబ్బులు రావని తేల్చి చెప్పారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొన్నం
నేడు హన్మకొండ జిల్లాలో కొత్తకొండ ఎర్రబెల్లి నారాయణ గిరి వరకు నిర్మించే డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముల్కనూరు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు జిమ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ములకనూరు మోడల్ స్కూల్ లో మొక్కలు నాటారు. ముల్కనూరు నుండి కొత్తపల్లి వరకు నిర్మించే నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల మంజూరు పత్రాల పంపిణీ
ఆపై ముల్కనూరు లో శ్రీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పాలనా ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, స్టీల్ బ్యాంక్ కిట్ల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఆపై ఇందిరమ్మ లబ్దిదారులకు కీలక సూచనలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+