వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌‍కు గట్టి షాక్: మంత్రి లక్ష్మారెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ గెలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి లక్ష్మారెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గమైన జడ్చర్లలోని కావేరమ్మపేట మేజర్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు బుక్కా వెంకటేష్ 152 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ మద్దతుదారుపై గెలుపొందారు.

టిఆర్ఎస్‌కు ఇది గట్టి షాక్ అని చెప్పవచ్చు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2013లో ఈ పంచాయతీకి ఎన్నిక జరగలేదు. కోర్టు ఆదేశం మేరకు శనివారం జరిగింది. సర్పంచ్‌తో పాటు తొమ్మిది వార్డులకు ఎన్నికలు జరిగాయి. మూడు చోట్ల టిఆర్ఎస్ మద్దతుదారులు, మూడు చోట్ల టిడిపి మద్దతుదారులు గెలిచారు.

కాంగ్రెస్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోచోట గెలిచారు. మంత్రి లక్ష్మా రెడ్డి మూడు నెలలుగా కావేరమ్మపేట పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. పలు అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అయినా టిఆర్ఎస్ గెలవలేదు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లు రవి పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు.

Shock to KCR and minister Laxma Reddy: Congress wins in Kaverammapeta panchayati

నల్గొండ జిల్లాలో నకిరేకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచాఫ్రంట్‌గా ఏర్పడి కాంగ్రెస్ నాయకురాలు పన్నాల రంగమ్మను బరిలో నిలిపారు. ఈమె టిఆర్ఎస్ మద్దతుదారు పైన 439 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

టిఆర్ఎస్ దూకుడు నిలువరించాలని కాంగ్రెస్, సిపిఎం, టిడిపి, వైసిపిలు ప్రజాఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. మరో ఐదుచోట్ల టిఆర్ఎస్ మద్దతుదారులు, రెండు చోట్ల ప్రజాఫ్రంట్ మద్దతుదారులు, ఓ స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచులుగా గెలిచారు.

English summary
Congress wins in Kaverammapeta panchayati in Mahaboohnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X