వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్.. జీవో 16 కొట్టివేస్తూ తీర్పు, ఇరకాటంలో సీఎం కేసీఆర్

తెలంగాణ సర్కారుకి హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవో 16 చెల్లదంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. దీనికి సంబంధించిన జీవోను కొట్టవేసింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.

cm-kcr

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 16ను తీసుకొచ్చింది. అయితే దీనికి వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం బుధవారం తాజాగా ఆదేశాలను జారీ చేసింది. 1996 త‌ర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయ‌వ‌ద్దంటూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను ఇచ్చిన కోర్టు.. ఈరోజు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

English summary
Hyderabad: It's a shock for Telangana Government. High Court today Cancelled the GO No.16 of Contract Employees Regularization issued by the Telangana Government. The students of the Osmania University filed a pil on this go long back. Today high court issued final judgement in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X