సినీ హీరో నవదీప్ కు షాక్: ఈడీ నోటీసులు!!
టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కు తాజాగా ఈడి అధికారులు షాక్ ఇచ్చారు. టాలీవుడ్ హీరో నవదీప్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారంగా ఈడి అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
ఈనెల 10వ తేదీన నవదీప్ ను ఈడి ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో నవదీప్ మరోమారు విచారణను ఎదుర్కోనున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను ఏ 29 గా పోలీసులు పేర్కొన్నారు. ఆయనను డ్రగ్స్ వినియోగదారుడు గా పేర్కొన్న పోలీసులు నవదీప్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు.

నవదీప్ కు నోటీసులు అందజేసి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇక నవదీప్ కేసు నుంచి తప్పించుకోవడానికి మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ను విచారణ జరిపిన నార్కోటిక్ బ్యూరో దాదాపు ఆరు గంటల పాటు ఆయనను విచారించారు.
డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంతో తాను నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణకు హాజరయ్యారని పేర్కొన్న నవదీప్, ఈ కేసులో అరెస్ట్ అయిన రామ చందర్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ కానీ తాను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు.
అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తన సమాధానం చెప్పానని, అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని వారు చెప్పారని నవదీప్ విచారణ అనంతరం పేర్కొన్నారు. ఇక ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారం చేసుకుని, ఈడీ అధికారులు నవదీప్ పై కేసు నమోదు చేశారు. ఇక నవదీప్ ను ఈనెల 10వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు.












Click it and Unblock the Notifications