కవితకు సుప్రీం షాక్.. మధ్యంతర బెయిల్ పై ట్విస్ట్!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడి, సిబిఐ కేసులలో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నం చేసిన కవిత చివరి ప్రయత్నం గా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంది. అయితే నేడు ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసి కవితకు షాక్ ఇచ్చింది.

కవితకు మళ్ళీ నిరాశ
ఇక ఈరోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడి, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మద్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో మళ్లీ కవితకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించగా ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Shock to MLC Kavitha supreme court said interim bail cannot be granted without hearing ED CBI arguments

ఆగస్టు 20వ తేదీకి వాయిదా
ఈ కేసులో ప్రతి వాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతున్న కవిత పిటిషన్ పై స్పందించాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సిబిఐ, ఈడికి సుప్రీం నోటీసులు పంపించడంతో దీనిపై ఈడి, సిబిఐ అధికారులు తమ స్పందనను తెలియజేయనున్నారు.

కవితకు బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ఎస్
ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశించారు. దీంతో పాటు కవిత ఆరోగ్యం క్షీణించటం, ఇతర అంశాలను కూడా కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. కచ్చితంగా బెయిల్ వస్తుందని భావించిన చోట సుప్రీం మళ్ళీ పెండింగ్ పెట్టటం బీఆర్ఎస్ శ్రేణులను నిరాశపరిచింది.

ప్రతివాదులైన ఈడీ, సీబీఐ వాదనలు విన్నాకే బెయిల్
అయితే బెయిల్ పిటిషన్ పై దర్యాప్తు సంస్థల స్పందన తెలిసిన తర్వాత, వారి వాదనలు కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సుప్రీంకోర్టు ఆగస్టు 20వ తేదీకి కేసును వాయిదా వేసింది. దీంతో కవితకు మళ్ళీ ఆగస్టు 20వ తేదీ వరకు నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15వతేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో సిబీఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+